సాధారణంగా ఓ మూవీ ట్రైలర్‌లో ది బెస్ట్ సీన్స్‌ని మాత్రమే చూపిస్తారు. సినిమా మొత్తంలో అవే కీలకం అనేలా ట్రైలర్‌ని కట్ చేస్తారు. ఎందుకంటే ఓ ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడంలో పాటలతో పాటు ట్రైలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెండింటిలో ‘బ్రో’మూవీ విఫలమైంది. తమన్ అందించిన పాటలపై తొలి నుంచి విమర్శలే వచ్చాయి. తమ హీరోకి సరైన పాటలు అందించలేదని పవన్ కల్యాణ్ ఫ్యాన్సే తమన్‌ను ట్రోల్ చేశారు. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ కూడా ఫ్యాన్స్‌ని కాస్త నిరాశకే గురి చేసింది. పవన్ నోట ఒక్కటంటే ఒక్కటి గుర్తించుకునే డైలాగ్ ట్రైలర్‌లో చూపించలేదు.
‘బ్రో’సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం`కు తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని పవన్‌తో సెట్ చేసింది అతని ‘గురువు’ త్రివిక్రమ్. ‘వినోదయ సీతం’ కథంతా మార్చేసి కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించినా.. మిగతావన్నీ త్రివిక్రమే చూసుకున్నాడు. తొలుత మాటల కోసం సాయి మాధవ్ బుర్రా అనుకుంటే.. త్రివిక్రమే రంగంలోకి దిగి మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. ఇందుకుగాను రూ.15 కోట్లతో పాటు లాభాల్లో పావలా వాటాను రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని టాలీవుడ్ టాక్.
(చదవండి: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)
కేవలం స్క్రీన్‌ప్లే, మాటల కోసం ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి. అయితే నిన్నటి ట్రైలర్‌లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించలేదు. ట్రైలర్‌లోనే అలాంటి డైలాగ్స్ లేవంటే.. సినిమాలో కూడా లేనట్టే. పాటలు, ట్రైలర్ యావరేజ్‌గా ఉన్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే.. జులై 28వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment