పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్ ఎంతో హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. దానికి రెండు కారణాలు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలన్నీ రీమేక్‌లు కావడం. గతంలో నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం. అందుకే పవన్ సినిమాలను ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా సరిగా కావడం లేదు. తాజాగా పవన్ నటించిన ‘బ్రో’ని కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదట.
ఈ చిత్రానికి నైజాం నుంచి దాదాపు రూ.35 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ రాబట్టాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇది పవన్ గత చిత్రం భీమ్లా నాయక్ కంటే రెండు కోట్లు ఎక్కువనే చెప్పాలి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు ‘బ్రో’ని కొనేందుకు విముఖత చూపిస్తున్నారట. అసలే ‘బ్రో’ మూవీ రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి తెలుగు రీమేక్. ఈ మధ్యకాలంలో రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టడం లేదు.
(చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?)
అందుకే దిల్‌రాజు ‘బ్రో’ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే పవన్ కల్యాణ్‌కి నైజాంలో మార్కెట్ పెరగడం లేదు. ఈ విషయంలో కూడా దిల్‌రాజు భయపడుతున్నారట. సినిమా తన చేతుల్లో నుంచి పోయినా పర్లేదు కానీ అంత భారీ మొత్తానికి కొని, కోట్లలో నష్టపోవడం ఎందుకనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ దిల్ రాజు ముందుకు రాకపోతే మైత్రీ మూవీస్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ పెట్టాలనే ‘బ్రో’ నిర్మాత భావిస్తున్నారట.
'బ్రో' సినిమా విషయానికొస్తే.. రెండేళ్ల క్రితం సముద్రఖని దర్శకత్వం వహించిన `వినోదయ సీతం’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment