I receive messages from Pakistan: Priya Prakash Varrier - Sakshi
Sakshi News home page

Priya Prakash Varrier: ఇక్కడ కన్ను కొడితే.. పాక్ కుర్రాళ్లు పడ్డారు!

Published Sun, Jul 16 2023 9:26 PM | Last Updated on Mon, Jul 17 2023 9:24 AM

Priya Varrier Said Her Fans Club In Pakistan - Sakshi

ఆమె ఓ సాధారణ యువ నటి. కన్ను గీటిన ఓ వీడియో వల్ల దేశవ్యాప్తంగా పాపులర్ ‍‍అయిపోయింది. ఫస్ట్ మూవీ రిజల్ట్ సంగతి పక్కనబెడితే పలు భాషల్లో సినిమా ఛాన్సులు కొట్టేసింది. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేస్తే వాటిలో ఏదీ కూడా హిట్ అవ్వలేదు. అయితేనేం పాకిస్థాన్ లో ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెట్టారట. అవును ఈ విషయాన్ని ఆ బ్యూటీనే స్వయంగా బయటపెట్టింది.

ఒక్క వీడియో దెబ్బకు
కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ వారియర్.. డిగ్రీ చదువుతున్నప్పుడే 'ఒరు అదార్ లవ్' (లవర్స్ డే) అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈమె స్టైల్‌గా కన్ను కొడుతున్న వీడియో బిట్ అప్పట్లో రిలీజ్ చేస్తే, ఊహించనంత పాపులారిటీ వచ్చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ తెలుగుతోపాటు ఇతర భాషల చిత్రాల్లోనూ ఛాన్సులొచ్చాయి.

(ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల)

తెలుగులో రెండే
జస్ట్ ఒక్క వీడియోతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియా వారియర్.. తెలుగులో నితిన్ 'చెక్', తేజా సజ్జా 'ఇష్క్' సినిమాల్లో నటించింది. కానీ ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈమె నటించిన గత మూడు చిత్రాలు మలయాళంవే. అవి కూడా ఏమంత చెప్పుకోద్దగ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేదు. ప్రస్తుతం ఈమె 'బ్రో' మూవీపైనే ఆశలు పెట్టుకుంది.

పాక్‌లో ఫ్యాన్స్
బాలీవుడ్ పలువురు పాక్ సింగర్స్, నటులు ఉంటారు కానీ మన యాక్టర్స్ కి దాయాది దేశంలో పెద్దగా అభిమానులు ఉండరు. అలాంటిది ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియోకు పాక్ కుర్రాళ్లు పడిపోయారు. దీని గురించి స్వయంగా ఈ బ్యూటీనే చెప్పింది. దేనికి కనెక్ట్ కానీ పాక్ ప్రేక్షకులకు తన వీడియో తెగ నచ్చేసిందని, రోజూ మెసేజులు పెట్టేవారని, బాగా చేశావని మెచ్చుకున్నారని చెప్పింది. మీ కోసం ఇక్కడ అభిమాన సంఘాలు ఉన్నాయని వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయేదాన్నని ప్రియా వారియర్ పేర్కొంది.

(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement