Actress Priya Prakash Varrier Leaves Fans Stunned With Latest Photos, Goes Viral - Sakshi
Sakshi News home page

Priya Prakash Varrier: కన్నుగీటు భామ ప్రియా వారియర్‌ ఇలా అయిందేంటి?

Published Sat, Mar 26 2022 3:45 PM | Last Updated on Sat, Mar 26 2022 5:20 PM

Priya Prakash Varrier Leaves Fans Stunned With Latest Photos - Sakshi

అలా కన్నుకొట్టి ఇలా ఫేమస్‌ అయిపోయింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఒరు ఆడార్‌ లవ్‌ సినిమా ప్రచారంలో భాగంగా రిలీజ్‌ చేసిన కన్ను కొట్టే సీన్‌ దేశవ్యాప్తంగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే! ఆ ఒక్క సీన్‌తో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించుకున్న ఆమెను అభిమానులు ముద్దుగా వింక్‌ బ్యూటీ అని పిలుచుకుంటారు.

ఈ కేరళకుట్టి తెలుగులో ఇష్క్‌, చెక్‌ సినిమాలు చేసింది. కానీ ఇవి బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందులో ఆమె గిరిజన యువతిగా ముస్తాబైంది. కట్టుబొట్టు, కాళ్లకు పారాణితో అచ్చం గిరిజనురాలిగా కనిపిస్తోంది. అంతా బానే ఉంది, కానీ ప్రియ ముఖంలో చిరునవ్వు మిస్‌ అవడంతో కంగారుపడుతున్నారు ఫ్యాన్స్‌.

ఎందుకలా బాధగా ఉన్నావు, నిన్నిలా చూడలేకపోతున్నాం, నీకేమైంది ప్రియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కేవలం ఫొటోషూట్‌లో భాగంగానే ఆమె విచారంగా, దీనంగా ముఖం పెట్టినట్లు తెలుస్తోంది.

చదవండి:  అందుకే జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నా: సింగర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement