Miss Shetty Mr. Polishetty is Set for Release on August 4th - Sakshi
Sakshi News home page

Anushka Shetty: ఇంట్రెస్టింగ్ ఫైట్.. హిట్ కొట‍్టేది ఎవరు?

Published Mon, Jul 3 2023 3:25 PM | Last Updated on Mon, Jul 3 2023 3:43 PM

Miss Shetty Mr Polishetty Release Date - Sakshi

వేసవితో పాటు గత కొన్నిరోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డల్‌గా ఉంది. దాదాపు వచ్చినవన్నీ చిన్న సినిమాలు, వాటిలోనూ హిట్ కొట్టినవి తక్కువే. ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాలు పెద్దగా లేవు. మొన్నటివరకు పరిస్థితి ఇది. కానీ రాబోయే కొన్ని నెలలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా ఉండదు. బోలెడన్ని కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వీటిలో ఓ ఫైట్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

'మిస్ శెట్టి' రిలీజ్ ఫిక్స్
అనుష్క శెట్టి.. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'జాతిరత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా ఇదే. కొన్నాళ్ల ముందు టీజర్ విడుదల చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్లలోకి ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఆగస్టు 4న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల‍్లోకి ఏకంగా 24 సినిమాలు)

మెగా బ్రదర్స్‌తో పోటీ
అనుష్క 'మిస్ శెట్టి' సినిమా సోలో రిలీజ్. కానీ దీనికి వారం ముందే అంటే జూలై 28న పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ 'బ్రో' థియేటర్లలోకి వస్తుంది. దీనికి వారం తర్వాత అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' థియేటర్లలోకి వస్తుంది. అటు చిరు ఇటు పవన్ మధ్యలో అనుష‍్క తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ ఫైట్ ఆసక్తి రేపుతోంది.

అనుష్కకే ప్లస్
చిరు, పవన్ సినిమాలతో పోలిస్తే అనుష్క మూవీకే ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశముంటుంది. ఎందుకంటే 'బ్రో'.. వినోదయ సీతం రీమేక్, 'భోళా శంకర్'.. వేదాళం చిత్రానికి రీమేక్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మాత్రం ఒరిజినల్ కథతోనే తీశారు. అలానే కామెడీని నమ్ముకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏ సినిమా హిట్ అవుతుందా అనే ఒకటే టెన్షన్. ఒకవేళ మూడు సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్స్ ఎలా వస్తాయనేది ఇంకా ఇంట్రెస్టింగ్. చూడాలి మరి ఏం జరుగుతుందో?


(ఇదీ చదవండి: చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement