మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌, భోళా శంకర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది | Megastar Chiranjeevi Bholaa Shankar Release On April 14, 2023 | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌, భోళా శంకర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Sun, Aug 21 2022 1:26 PM | Last Updated on Sun, Aug 21 2022 1:52 PM

Megastar Chiranjeevi Bholaa Shankar Release On April 14, 2023 - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళం తెలుగు రీమేక్‏ ఇది.  చిరంజీవి కెరీర్‏లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌, బిత్తిరి సత్తి, యాంకర్‌ శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు.

చదవండి: తొలి రెమ్యునరేషన్‌ ఎంతో చెప్పిన ఆలియా, ఆ చెక్‌తో ఏం చేసిందంటే

అయితే రేపు(ఆగస్ట్‌ 22) చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీం అదిరిపోయే అప్‌డేట్‌ను వదలింది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసి తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్‌ 14, 2023లో సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్‌. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement