సినిమా అన్నాక జయాపజయాలు సర్వసాధారణమే! పెద్దగా ప్రచారం లేకపోయినా హిట్ కొట్టేవి కొన్నయితే భారీ అంచనాల మధ్య డిజాస్టర్‌గా నిలిచేవి మరికొన్ని.. హీరోలు ఈ రెండిటింనీ సమానంగా స్వీకరించినా సరే అభిమానులు మాత్రం లైట్ తీసుకునేందుకు ఇష్టపడరు. సక్సెస్ అయితే పూనకంతో, ఫ్లాప్ అయితే ఆగ్రహంతో ఊగిపోతుంటారు. సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా వాళ్లను ఆపడం చాలా కష్టం. ఈ మధ్య చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలైంది. బాస్ మూవీ అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ సినిమా అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినిమాపై విమర్శలే కనిపించాయి.
నేను మీలో ఒకడిని
తాజాగా దీనిపై బేబి నిర్మాత, మెగా అభిమాని ఎస్‌కేన్ స్పందించాడు. ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా మొదటి టికెట్ తెగేది మెగా ఫ్యాన్‌ది మాత్రమే! నా కో- మెగా ఫ్యాన్స్‌ను నేను నమ్మాను.. వాళ్లు నా సినిమాకు ఓపెనింగ్స్ ఇస్తారనే బేబి తీశాను. ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టినా దాని క్రెడిట్ ముందుగా మెగా ఫ్యాన్స్‌కే దక్కుతుంది. నేను మీలో ఒకడిని. బాస్ ఇన్‌స్పిరేషన్‌తో ఇక్కడికి వచ్చాను. బాస్ చుట్టూ జరుగుతున్న వివాదం గురించి మాట్లాడాలనుకుంటున్నాను.
ఆడిస్తున్నాడు.. ఓడిస్తున్నాడు
మన సినిమా నచ్చితే ఫస్ట్ జై కొట్టేది మనమే.. మన సినిమా ఏదైనా నచ్చకపోయినా మొదట దాన్ని తొక్కేసేది కూడా మనమే.. ఫస్టాఫ్ అలా ఉంది, ఇంటర్వెల్ ఇలా ఉంది, సెకండాఫ్ ఇంకోలా.. అని చెప్పేస్తుంటాం. అలా చేయొద్దు. నాలుగు పదులకే నడవలేని హీరోలు ఉన్న ఇండస్ట్రీలో.. సుమారు ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా మెగాస్టార్ ఆడిస్తున్నాడు.. చాలామందిని ఓడిస్తున్నాడు. అది ఆయన విల్ పవర్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఆయన మోస్ట్ గ్లామరస్‌గా కనిపించిన సినిమా భోళాశంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే దానికి కారణం మనమే.
ఏది చేయాలో బాస్‌కు తెలుసు
రీమేక్స్ చేయాలా? ఒరిజినల్ చేయాలా? అనేది బాస్‌కు తెలుసు. ఆయనకు సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం. మోకాలికి ఆపరేషన్ చేయించుకుని కూడా స్టెప్స్ వేస్తున్నారు. మనందరి కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా బాస్ వెంటే ఉండాలి. మనం ఐకమత్యంతో ఉంటే మనల్ని కొట్టేవాళ్లే లేరు. చాలామంది హిట్లర్ ముందు బాస్ పనైపోయిందన్నారు. ఖైదీ 150 ముందు కూడా అలాగే అన్నారు. అలా జరిగిందా.. లేదు.. ఆయన స్థాయి, స్థానం వేరు. ఆగస్టు 11న ఆయన సినిమాను ఎవరు తొక్కేలాయనుకున్నారో తెలుసు.. మనం మళ్లీ హిట్ కొట్టి చూపిద్దాం' అని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు ఎస్‌కేఎన్.
చదవండి: బర్త్‌డే పార్టీలో డ్యాన్స్ చేసేదాన్ని.. ఆ డబ్బుతో పూట గడిచేది..
Comments
Please login to add a commentAdd a comment