మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!? | Buzz: Chiranjeevi Decided To Not Do Remakes With Bhola Shankar Movie Result, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi On Movie Remakes: మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ డెసిషన్!

Published Mon, Aug 28 2023 5:17 PM | Last Updated on Mon, Aug 28 2023 5:57 PM

Chiranjeevi No To Remakes With Bhola Shankar Result - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యే మోకాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని, కొత్త ప్రాజెక్ట్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన చిరు.. కెరీర్‌లోనే ఘోరమైన డిజాస్టర్‌ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ వల్ల మెగాస్టార్ చిరు.. తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

చిరంజీవిని కంప్లీట్ యాక్టర్ అనొచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటే ఫ్లాప్స్‌ని కూడా చూశారు. అయితే అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ 'ఆచార్య', 'భోళా శంకర్' చిత్రాలు మాత్రం ఫ్లాప్ కావడంతో పాటు విపరీతమైన ట్రోలింగ్‌కి గురయ్యాయి.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు.. సినిమా కన్ఫర్మ్)

రీఎంట్రీలో తప్పటడుగులు వేస్తున్న చిరు.. 'ఖైదీ నం.150', 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' రీమేక్స్‌లో నటించారు. కానీ వాటి ఫలితం ఏంటనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా రీమేక్స్ దెబ్బకొడుతున్నా సరే.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బ్రో డాడీ' రీమేక్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. 

అయితే 'భోళా శంకర్' రిజల్ట్ చిరుని ఆలోచనలో పడేసిందట. దీంతో ఇకపై రీమేక్స్ చేయకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ నిర్మాత.. మలయాళ చిత్ర రీమేక్స్ రైట్స్ పట్టుకుని మెగాస్టార్‌కి దగ్గరకి వెళ్తే.. సున్నితంగా నో చెప్పేశారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే కాస్త లేట్ అయినా సరే చిరు.. స్ట్రెయిట్ సినిమాలే చేస్తారనమాట.

(ఇదీ చదవండి: కేఏ పాల్‌ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement