'భోళా శంకర్' సినిమా బాగోలేదు. మొదటిరోజే అందరికీ సీన్ అర్థమైపోయింది. దీంతో ఆ మూవీని పట్టించుకోవడం మానేశారు. ఆల్రెడీ చాలామంది మర్చిపోయారు కూడా. మళ్లీ ఆ సినిమా ఇప్పుడు చర్చల్లో నిలిచింది. దీనికి కారణం నిర్మాత ఎస్కేఎన్. తాజాగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈయన.. 'భోళా' ఫ్లాప్ అవ్వడానికి ఫ్యాన్సే కారణమనే వింత లాజిక్ చెప్పారు. దీంతో ఇది కాస్త మెగాఫ్యాన్స్ మధ‍్యే డిస్కషన్‌కి కారణమైంది.
(ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!)
అభిమానం ఉండొచ్చు గానీ అది సదరు హీరో కొంపముంచేలా ఉండకూడదు. ఎస్కేఎన్.. చిరంజీవికి వీరాభిమాని. గతంలో చాలా సందర్భాల‍్లో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయినా చిరుకి అభిమాని కానివాళ్లు ఎవరుంటారు చెప్పండి. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరిస్తున్నారు. అయితే చేదుగా అనిపించినా సరే కొన్నిసార్లు నిజాలు ఒప్పుకోవాలి. ఎస్కేఎన్ అదే చేయలేదు. ''భోళా శంకర్'లో చిరంజీవి చాలా అందంగా కనిపించారు. కేవలం సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ట్రాప్‌లో పడి స్వయంగా ఫ్యాన్సే దాన్ని డిజాస్టర్ చేసుకున్నారు' అని చెప్పడం చాలామందికి విడ్డూరంగా అనిపించింది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. సినిమా బాగుంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. చిరు అందంగా కనిపించారు కాబట్టి హిట్ అవ్వాలని ఎస్కేఎన్ అనుకోవడం మాత్రం వెరైటీగా అనిపించింది. పోనీ ఆయన చెప్పిన థియరీ ప్రకారం మహేశ్ 'బ్రహ్మోత్సవం', పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' కూడా సూపర్‌హిట్ కావాలి కదా! కానీ ఎందుకు సక్సెస్ కాలేదు అంటే కారణం కంటెంట్. సినిమా కరెక్ట్‌గా తీస్తే.. చిన్న హీరో పెద్ద హీరో అనేది ప్రేక్షకుడు అస్సలు ఆలోచించడు. హిట్ ఏంటి కర్మ బ్లాక్‌బస్టర్ చేసి పడేస్తాడు. వందల కోట్ల వసూళ్లకు తెచ్చిపెడతాడు.
(ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!)
ఎస్కేఎన్ నిర్మాతగా తీసిన 'బేబి' చిత్రాన్నే తీసుకోండి. అందులో పెద్దగా చెప్పుకోదగ్గ యాక్టర్స్ ఒక్కరు కూడా లేరు. కానీ సినిమా హిట్ అయింది. దానికి కారణం స్టోరీ. ఇకపోతే 'భోళా శంకర్' స్టోరీలోనే బోలెడన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని హుందాగా ఒప్పేసుకొని, చిరంజీవి త్వరలో కమ్ బ్యాక్ ఇస్తారని ఎస్కేఎన్ అని చెప్పుంటే సరిపోయేది. అలా కాకుండా అభిమానులపై తప్పు తోసేయడం మాత్రం చాలామందికి కోపం తెప్పించింది.
సినిమాలో నటించే స్టార్ హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు ఎవరెన్ని కబుర్లు, తీయని మాటలు చెప్పినా అది వందల కోట్లతో నడిచే ఓ వ్యాపారం. అభిమాని అయినా, సాధారణ ప్రేక్షకుడు అయినా సొంత డబ్బులు ఖర్చుపెట్టి టికెట్ కొంటాడు. సినిమా చూస్తాడు. బాగుంటే నలుగురికి చెబుతాడు. బాగోలేకపోతే నలభై మందికి చెబుతాడు. కాబట్టి మెగాస్టార్ సినిమా కదా.. ఎలా ఉన్నా నచ్చేయాలని రూల్ ఏం లేదు. తప్పు ఎక్కడుందనేది ఆలోచించడం మానేసి ఫ్యాన్స్‌దే తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్షా?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment