పవన్ కల్యాణ్‌కు జ్వరం వచ్చింది. ఏకంగా 102 డిగ్రీల టెంపరేచర్ ఉంది.. అందుకే బస్సు యాత్ర వాయిదా.. ఇదీ నిన్నటి నుంచి జనసేన నాయకులు చేస్తోన్న ప్రచారం. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే నమ్మారు. నిజంగానే తమ నాయకుడు అస్వస్థతకు గురయ్యారని, త్వరగా కోలుకొని బస్సుయాత్రకు రావాలని కోరుకున్నారు. కానీ తాజాగా ఓ ఫోటో చూసి మాత్రం అంతా బిత్తరపోయారు. ఇదే జ్వరమా? ఆ సాకుతో ఆడుతున్న పొలిటికల్ డ్రామానా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజులుగా వారాహి వాహనంలో యాత్ర చేస్తోన్న పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయినట్టు జనసేన నేతలు చెప్పుకొచ్చారు. మంగళవారం నుంచి ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ప్రకటించారు. ఆ కారణంగానే రెండు రోజుల పాటు బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు.
కట్ చేస్తే.. హుషారుగా సినిమాకు డబ్బింగ్ చెప్తూ కనిపించాడు పవన్ కల్యాణ్. భీమవరంలోని పార్టీ కార్యాలయంలోనే తాను నటించిన తాజా చిత్రం ‘బ్రో’ టీజర్ డబ్బింగ్ చెప్పాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సముద్రఖని తెలియజేస్తూ ట్వీట్ చేయడంలో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
జ్వరం సాకుతో పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేక సాకులు చెప్తున్నారని కామెంట్ చేస్తున్నారు. డబ్బింగ్ కోసమే బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చాడని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేక జ్వరమంటూ పవన్ డ్రామాలాడుతున్నారని కొంతమంది నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
OUR #BRO ON FIRE 🔥 MODE💪💪💪💪💪 pic.twitter.com/JPQSEordTk
— P.samuthirakani (@thondankani) June 28, 2023
పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను షేర్ చేస్తూ ‘ఆరోగ్యం బాలేదు అని సైనిక్స్ కి చెప్పి బ్రో మూవీ కి సముద్రఖని తో కలిసి డబ్బింగ్ పూర్తి చేస్తున్న కళ్యాణ్ బాబు..ఇదీ రాజకీయాల్లో ఇతని సంకల్పం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ నెల 29న బ్రో మూవీ టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ టీజర్‌కు పవన్ డబ్బింగ్ బకాయి ఉంది. ఆ బకాయిని ఈ రోజు తీర్చుకున్నాడు. అయితే జ్వరం సాకుతో బస్సు యాత్రని ఆపి..డబ్బింగ్ చెప్పడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆరోగ్యం బాలేదు అని సైనిక్స్ కి చెప్పి BRO మూవీ కి సముద్రఖని తో కలిసి డబ్బింగ్ పూర్తి చేస్తున్న కళ్యాణ్ బాబు..ఇదీ రాజకీయాల్లో ఇతని సంకల్పం pic.twitter.com/gynKPio2ho
— Amar Amar (@amarballa2) June 28, 2023
It's fun-filled entertainer 😂❤️#PawanKalyan enjoyed the teaser while in dubbing session it seems #BroTeaser | #BroTheAvatar pic.twitter.com/fxw3t7tANq
— Twood VIP™ (@Twood_VIP) June 28, 2023
Comments
Please login to add a commentAdd a comment