జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా పిఠాపురం అసెంబ్లీకి నామినేషన్ వేశాడు. అందులో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివారలను పొందుపరిచి అందరి సందేహాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి 15 ఏళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో ఆయన చదువుకు సంబంధించిన వివరాలు అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా నామినేషన్ పత్రంలో ఆ వివరాలను పవన్ పొందుపరిచాడు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే పెద్దగా విద్యార్హత ఉండాలనే నిబంధనంటూ ఏమీ లేదు.. దానిని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. కానీ ఇక్కడ పవన్ మాత్రమే విద్యార్హత విషయంలో ఎందుకు ట్రోల్ అవుతున్నాడంటే.. గతంలో తనకు వచ్చిన మార్కులకు సీట్ రాకపోవడంతో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో చెప్పాడు. కొద్దిరోజుల గ్యాప్‌లోనే తను అనుకున్న సీట్ రాకపోవడంతో వేరే గత్యంతరం లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పాడు.
అంతటితో పవన్ చదువు ఆగిపోలేదు ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌కు వెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు. ఇలా ఆయన పొంతన లేని మాటలు చెప్పడంతో అసలు పవన్ ఇంటర్మీడియట్ చదివాడా లేదా..? ఒకవేళ చదివితే ఏ గ్రూప్ చదివాడో తెలుసుకోవాలని నెటిజన్లు కూడా ఆరాటపడేవారు. సీఈసీ , ఎమ్‌ఈసీ,ఎంపీసీ ఇలా ఇంటర్మీడియట్‌లోని దాదాపు అన్నీ గ్రూపుల పేర్లు పవన్ చెప్పడంతో ప్రజల్లో కూడా కాస్త కన్‌ఫ్యూజన్ ఏర్పడింది.
పవన్ ఏం చదివారంటే..
పిఠాపురం అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నాడు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో 1984లో పదోతరగతి పూర్తి చేసినట్లు పవన్ తెలిపాడు. చదువు గురించి గతంలో పవన్ ఇలా కూడా చెప్పుకొచ్చాడు. ఒకసారి చదవంటే ఇష్టం అంటాడు.. కానీ నాకు చదవు పెద్దగా రాదని మరోకసారి అంటాడు. ఇంకోసారి అయితే ఇంగ్లీష్ రాదు అంటాడు.. మళ్లీ ఇంగ్లీష్‌లో తాను ఫస్ట్ అంటాడు.
ఎలక్ట్రానిక్ డిప్లొమా చేశానంటాడు.. మళ్లీ ఇంతలోనే కంప్యూటర్స్‌లో డిప్లొమా చేశాను అంటాడు. ఆపై డాక్టర్‌ను అవ్వాలని గట్టిగా ప్రయత్నం చేశాను అంటాడు. ఇలా ఆయన నుంచే తన చదువు గురించి పలు సందర్భాల్లో పొంతన లేని వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లలలో కూడా పవన్ విద్యార్హత గురించి ఆసక్తి నెలకొంది. ఫైనల్‌గా ఆయన ఏం చదువుకున్నాడో పిఠాపురం చెప్పేసింది.
Comments
Please login to add a commentAdd a comment