
రాజు రవితేజ.. ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకం.. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం పవన్ చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి..? గత ఐదేళ్లలో జనసేన ప్రభావం ఎంటి..? పవన్‌కు పెద్ద దిక్కు లేకుంటే ఎలాంటి పనిచేయలేడా..? పవన్ పిరికివాడా లేదా ధైర్యవంతుడా..? పవన్ విషయంలో జనసేన క్యాడర్‌కు నచ్చనిదేంటి..? ఏపీలో పవన్ ఇమేజ్ పడిపోయిందా..? భవిష్యత్‌లో పవన్ సినిమాల పరిస్థితి ఏంటి..? పవన్ వెంట ఉన్న వారందరూ ఎందుకు దూరం అయ్యారు..? జనసేనకు 21 సీట్లు ఉంటే 16 మంది అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? 2024లో ఏపీలో అధికారం ఎవరిది..? ఇలా ఎన్నో ప్రశ్నలకు రాజు రవితేజ ఈ పూర్తి వీడియోలో సమాధానం ఇచ్చారు.