raju raviteja
-
గుడిమెట్లు కడిగితేనే పవిత్రమైపోతాడా.. పవన్‌పై రవితేజ సంచలన వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ పేరుతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నాడని జనసేన మాజీ జనరల్ సెక్రటరీ రాజు రవితేజ అన్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను తమ రాజకీయం కోసం ఆడుకోవడం ఏమాత్రం మంచిది కాదని పవన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎంతో సున్నితమైన అంశాన్ని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లారని కూటమి ప్రభుత్వాన్ని రవితేజ తప్పుబట్టారు. రాజ్యంగా పరమైన చట్టబద్ధతతో కూడిన పదవుల్లో ఉన్న పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి..? అంటూ ప్రశ్నించారు.'ప్రస్తుతం ఏపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారా అనిస్తుంది. టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా కూడా అదే రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్‌ను తిట్టిన మీడియానే నేడు ఆయన్ను భుజానికి ఎత్తుకుంది. భవిష్యత్‌లో ఏదోరోజు పవన్ కల్యాణ్‌ను అదే మీడియా తొక్కేస్తుంది. ధర్మాన్ని పవన్ కల్యాణ్ పాటిస్తారా..? పవన్ కొత్త అవతారం వెనుకున్న ప్లాన్ ఏంటి..? క్రిస్టియన్స్‌ను పవన్ కల్యాణ్ ద్వేస్తున్నారా..? వంటి అంశాలపై రాజు రవితేజ స్పందించారు. ఈ పూర్తి వీడియోలో చూడొచ్చు. -
సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడటమా..! జనసేన మాజీ జనరల్ సెక్రటరీ సంచలన ఇంటర్వ్యూ
-
పిఠాపురంలో పవన్ కి దిక్కులేదు
-
పిఠాపురంలో పవన్‌కే దిక్కులేదు: రాజు రవితేజ
రాజు రవితేజ.. ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకం.. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి..? గత ఐదేళ్లలో జనసేన ప్రభావం ఎంటి..? పవన్‌కు పెద్ద దిక్కు లేకుంటే ఎలాంటి పనిచేయలేడా..? పవన్ పిరికివాడా లేదా ధైర్యవంతుడా..? పవన్ విషయంలో జనసేన క్యాడర్‌కు నచ్చనిదేంటి..? ఏపీలో పవన్ ఇమేజ్ పడిపోయిందా..? భవిష్యత్‌లో పవన్ సినిమాల పరిస్థితి ఏంటి..? పవన్ వెంట ఉన్న వారందరూ ఎందుకు దూరం అయ్యారు..? జనసేనకు 21 సీట్లు ఉంటే 16 మంది అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? 2024లో ఏపీలో అధికారం ఎవరిది..? ఇలా ఎన్నో ప్రశ్నలకు రాజు రవితేజ ఈ పూర్తి వీడియోలో సమాధానం ఇచ్చారు. -
పవన్‌కు అహం ఎక్కువ.. పూనమ్ కౌర్ టాపిక్‌పై రాజు రవితేజ కామెంట్
రాజు రవితేజ అంటే టక్కున ఎవరనే సందేహం రావడం సహజం. జనసేన, పవన్ అభిమానులకు మాత్రం ఆయన పేరు సుపరిచయమే. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన జనసేనలోకి మళ్లీ వెళ్లడం వంటి విషయాలతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ జనసేనలోకి వెళ్లే ఆలోచన లేదని రాజు రవితేజ పేర్కొన్నారు. పవన్ కూడా రమ్మని పిలవడని చెబుతూనే మరొకరితో ఆహ్వానం పంపుతాడని చెప్పారు. తన విషయంలో కూడా ఇదే జరిగిందని తెలిపారు. పవన్ ఒక అహంకారి అని చెబుతూ ఆయనలో టూ మచ్ అహం ఉందని రాజు రవితేజ చెప్పారు. చెప్పింది చేయడం.. చేసేది చెప్పడం ఈ రెండూ పవన్‌లో లేవన్నారు. పూనమ్ కౌర్ గొడవలో నేను లేను పూనమ్ కౌర్- పవన్ వివాదం మధ్యలో ఒక మీడియేటర్‌గా ఉన్నానని తనను చాలా మంది అనుకున్నారని రాజు రవితేజ చెప్పారు. కానీ అందులో నిజం లేదని, వారిద్దరి టాపిక్‌లోకి తాను ఎంట్రీ కాలేదని ఆయన తెలిపారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలియదని ఒకే ఒక్కసారి ఈ విషయంపై పవన్‌తో చర్చించానని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన విషయం ఏంటో పవన్ తనకు చెప్పారని.. కానీ అది వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు బహిరంగంగా చెప్పకపోవడమే మంచిదని రాజు రవితేజ దాటవేశారు. కానీ పూనమ్ కౌర్‌తో వ్యక్తిగతంగా తాను ఇప్పటి వరకు మాట్లడనే లేదని తనతో ఎలాంటి పరిచయం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరియర్ ఇదే ఏపీ రాజకీయాలపై రాజు రవితేజ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉన్న ధోరణితో వెళ్తే రాజకీయాల్లో సక్సెస్ అవడం కష్టం. ఎందుకంటే ఏపీ పొలిటికల్ రేస్‌లో పవన్ థర్డ్ రన్నర్. మొదటి స్థానంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ ఈ పొలిటికల్ రేసులోకి జూనియర్ ఎన్టీఆర్, ఎవరైనా వస్తే పవన్ నాలుగో స్థానంలో ఉంటారు. పోలింగ్ రోజున మీరు సెంటర్‌కు వెళ్లి చూస్తే.. ఓటు వేసేందుకు భారీగా లైన్ ఉంటుంది. అందులో లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్, యువకులు, ముసలి వారు, పేదలు ఇలా అందరూ ఉంటారు. కానీ ఆ లైన్లో పవన్ ఫ్యాన్స్ మాత్రం ఉండరు. వాళ్లు జెండాలు పట్టుకొని బైకులలో ఎక్కడో తిరుగుతుంటారు. వాళ్లతో పవన్‌కు ఏం లాభం ఉండదు. వాళ్లతో పవన్ ఈగో మాత్రమే సంతృప్తి చెందుతుంది. ఇది ఆయనలో మరింత అహంకారాన్ని పెంచుతుందే కానీ వాళ్లతో రియల్‌గా వచ్చేది ఏం లేదు. రియల్‌గా ఓటేసేది ఫ్యామిలీస్, పేదలు మాత్రమే. వాళ్ల జీవితాలను ఎవరైతే మారుస్తారో.. ఆ నమ్మకం ఎవరైతే కలిగిస్తారో వారికే ఓట్ వేస్తారు. పవన్ స్పీచ్‌కు, రియాలిటీకి సంబంధం ఉండదు. అని రాజు రవితేజ అన్నారు. వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు తప్పు వలంటీర్లపై పవన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని రాజు రవితేజ అన్నారు. వాళ్లు కూడా ఈ సమాజంలో భాగమే కదా.. వాళ్లు కూడా సమాజం కోసమే పని చేస్తున్నారు. వలంటీర్లను పవన్ ఎందుకు శత్రువులుగా భావిస్తున్నారో తెలియదు. వాళ్లపై అంత ద్వేషం ఎందుకు ఉందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పవన్ ఫ్యాన్స్‌లో కూడా ఇలాంటి ద్వేషమే కనిపిపిస్తుంది. వారికి నచ్చకపోతే బూతులతోనే విరుచుకుపడుతారు. పార్టీని వీడి ఇన్ని రోజులు అయినా తనపై బూతు కామెంట్లు చేస్తూనే ఉన్నారని రాజు రవితేజ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: బేబీ రనౌత్ రాక కోసం వెయిటింగ్: కంగనా రనౌత్) -
ఇప్పటికైనా పవన్ తీరు మారాలి: రాజు రవితేజ
-
పవన్ కల్యాణ్ మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి
-
పవన్ కల్యాణ్‌పై ‘రవితేజ’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాజు రవితేజ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ సన్నిహితుడు అయిన ఆయన శుక్రవారం జనసేనకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజు రవితేజ శనివారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కల్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారని విమర్శించారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో చేశానని, మరెంతో చేద్దామనుకున్నానని రవితేజ వెల్లడించారు. కానీ, తన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా పవన్ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని ఆయన ఒక్కసారి కూడా అమలు చేయలేదని వాపోయారు. పవన్ వైఖరి మునుపటిలా లేదని.. అందుకే పార్టీని వీడినట్టు రాజు రవితేజ వెల్లడించారు. ఆయన పూర్తిగా మారిపోయారు.. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ లేదని రవితేజ అన్నారు. పార్టీలో అంతర్గతంగా పారదర్శకత లేదని విమర్శలు గుప్పించారు. పవన్ సొంత పార్టీ వాళ్లను పైకి రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వేదికను ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీలోని సీనియర్లు సంతోషపడ్డారని రవితేజ గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ బాష పూర్తిగా మారిపోయిందని ...ఇది సమాజానికి ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కులాల మీద పవన్ అనవసరంగా మాట్లాడుతున్నారని రవితేజ పేర్కొన్నారు. అధికారం కోసం పవన్ తొందర పడుతున్నారని విమర్శించారు. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన సిద్ధాంతమని.. కానీ, అందుకు భిన్నంగా పార్టీలో పరిస్థితి దాపురించిందని వాపోయారు. పవన్ సున్నితమైన మనిషని.. కానీ, తలలు నరికేస్తానని పార్టీకి చెందిన ఒక కార్యకర్త అన్నప్పుడు దానిని ఖండించలేదని గుర్తు చేశారు. గతంలో పార్టీకి రాజీనామా చేసానని, కానీ, మళ్లీ తిరిగి పార్టీలో జాయిన్ అయ్యానని రవితేజ తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీలో తిరిగి చేరనని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం బయటపడిందని రవితేజ అన్నారు. జనసేన పార్టీలో స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. అంతా తన కంట్రోల్ ఉండాలని పీకే కోరుకుంటారని ఆయన విమర్శించారు. అంతకు ముందు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి ప్రవేశించామో మీరే ఆ వ్యాధిగా మారారు. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా.. పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని మీరు కోరారు. దాదాపు 12 ఏళ్లు మీ వెన్నంటే నడిచాడు. పార్టీకి సంబంధించి అన్ని విషయాల్లో మీతో చర్చించాను. పార్టీ కోసం ఎంతో చేశాను. మరెంతో చేద్దామనుకున్నాను. కానీ, మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి. హద్దుల్లేని అబద్ధాలతో మీ వ్యక్తిగత అహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటున్నారు. మీరు చేసే ప్రసంగాలు అబద్ధాలు, అసభ్యకర భాషతో ఉంటున్నాయి. మీరెప్పుడూ ధర్మవంతమైన మనిషిగా కాలేరు. ఒక మంచి మనిషి నుంచి నిజాయితీలేని, కుట్రపూరితమైన మనిషిగా మారారు’అని రాజు రవితేజ పేర్కొన్నారు. చదవండి: జనసేనకు షాక్.. పవన్ సన్నిహితుడి రాజీనామా -
జనసేనకు షాక్.. పవన్ సన్నిహితుడి రాజీనామా
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు భారీ షాక్ తగిలింది. పవన్ అత్యంత సన్నిహితుడు, జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ పార్టీకీ గుడ్‌బై చెప్పారు. ఇకపై పవన్‌తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. పవన్ ప్రవర్తన నచ్చకనే పార్టీని వీడుతున్నానని తెలిపారు. రాజకీయ, సామాజిక అధికారం దక్కించుకోవడానికి పవన్ అనర్హుడని.. రాజకీయాలకు పనికిరాడని రాజురవితేజ సంచలన ప్రకటన చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘పార్టీ భావజాలం, రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాను. జనసేన మెదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిని. పవన్ కోరిక మేరకు నాకు ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్.. ప్రస్తుతం కక్షసాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతన్ని అనుమతించకూడదు. పవన్ కల్యాణ్ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు. పవన్ కల్యాణ్ సమాజానికి ప్రమాదం’ అని రాజు రవితేజ్ అన్నారు. ఎవరీ రాజు రవితేజ్ రాజురవి తేజ్ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పరిచయమైన వ్యక్తి. తాను రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రేరణ ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి రాజు రవితేజ్ అని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పారు. పవన్ కల్యాణ్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి రాజు రవితేజ్ ఆయనతోనే ఉన్నారు. జనసేన పార్టీ రాజ్యాంగం అయిన పవనిజం పుస్తకాన్ని ఆయన రాశారు. -
జనసేనకు షాక్... పవన్ సన్నిహితుడు రాజీనామా
-
పవన్‌కు... రాజు రవితేజ దూరమయ్యాడా?
సినీనటుడు పవన్ కళ్యాణ్ అట్టహాసంగా ప్రారంభించిన 'జనసేన' పాల పొంగులాంటిదేనా? తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన విషయంలోనూ అదే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు సంవత్సరం క్రితం జనసేనను ఒక తుఫాను అని అభివర్ణించిన వారే ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం జనసేన కోమాలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అనేది సోదిలో కూడా కనిపించటం లేదు. పవన్ కూడా జనసేనపై ఆసక్తి చూపించటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో జనసేన పార్టీ స్థాపించడానికి తన వెనుక డబ్బున్నవారు, రాజకీయ నేతలు లేరనీ చెప్పిన పవన్ కళ్యాణ్... తన స్నేహితుడు రాజు రవితేజ మాత్రమే ఉన్నాడంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు పవన్‌కు కుడి భుజమైన రాజు రవితేజ ప్రస్తుతం కనిపించటం లేదు. పవన్ తో రాజు రవితేజ పూర్తిగా కట్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. పవన్ వ్యవహార శైలి నచ్చకే అతను ...దూరం జరిగినట్లు తెలుస్తోంది. పవన్.. ఊకదంపుడు ఉపన్యాసాలే కానీ.. చేతలు మాత్రం శూన్యమని తెలుసుకున్న రాజు రవితేజ పక్కకు తప్పుకున్నాడని ఓ వర్గం చెబుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... పీవీఆర్... పొట్లూరి వరప్రసాద్. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తాజాగా పీవీఆర్ కూడా పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖలో జరిగిన జనసేన సభల ఏర్పాటు నిమిత్తం పీవీఆర్...సుమారు మూడు కోట్లు ఖర్చుపెట్టారట. ఇందుకోసం ఆయన..ఎంపీ టిక్కెట్ ఇప్పించే విషయంలో ఒత్తిడి తెచ్చినా చివరికి ఫలితం లేకపోయింది. ఎన్నికల తర్వాత పీవీఆర్ కూడా 'తమ్ముడి' పట్టించుకోవటం లేదట. ఓ వైపు వ్యాపార వ్యవహారాలతో పాటు మరోవైపు సినిమా నిర్మాణాలతో బిజీగా ఉన్నారట. ఇక పవన్ కూడా తన సినిమాలపై దృష్టి పెట్టాడు. ఓ వైపు మాల్టీ స్టారర్ సినిమా 'గోపాల గోపాల' తో పాటు గబ్బర్ సింగ్-2లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒకవేళ టీడీపీ, బీజేపీలకు తన సేవలు అవసరం అయితే ...మరోసారి పవన్ తెరమీదకు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు ప్రతిఫలంగా బీజేపీ... పవన్‌కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం.