జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాజు రవితేజ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ సన్నిహితుడు అయిన ఆయన శుక్రవారం జనసేనకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజు రవితేజ శనివారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కల్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారని విమర్శించారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో చేశానని, మరెంతో చేద్దామనుకున్నానని రవితేజ వెల్లడించారు. కానీ, తన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా పవన్ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని ఆయన ఒక్కసారి కూడా అమలు చేయలేదని వాపోయారు. పవన్ వైఖరి మునుపటిలా లేదని.. అందుకే పార్టీని వీడినట్టు రాజు రవితేజ వెల్లడించారు.