రాజు రవితేజ అంటే టక్కున ఎవరనే సందేహం రావడం సహజం. జనసేన, పవన్ అభిమానులకు మాత్రం ఆయన పేరు సుపరిచయమే. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన జనసేనలోకి మళ్లీ వెళ్లడం వంటి విషయాలతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ జనసేనలోకి వెళ్లే ఆలోచన లేదని రాజు రవితేజ పేర్కొన్నారు. పవన్ కూడా రమ్మని పిలవడని చెబుతూనే మరొకరితో ఆహ్వానం పంపుతాడని చెప్పారు. తన విషయంలో కూడా ఇదే జరిగిందని తెలిపారు. పవన్ ఒక అహంకారి అని చెబుతూ ఆయనలో టూ మచ్ అహం ఉందని రాజు రవితేజ చెప్పారు. చెప్పింది చేయడం.. చేసేది చెప్పడం ఈ రెండూ పవన్‌లో లేవన్నారు.
పూనమ్ కౌర్ గొడవలో నేను లేను
పూనమ్ కౌర్- పవన్ వివాదం మధ్యలో ఒక మీడియేటర్‌గా ఉన్నానని తనను చాలా మంది అనుకున్నారని రాజు రవితేజ చెప్పారు. కానీ అందులో నిజం లేదని, వారిద్దరి టాపిక్‌లోకి తాను ఎంట్రీ కాలేదని ఆయన తెలిపారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలియదని ఒకే ఒక్కసారి ఈ విషయంపై పవన్‌తో చర్చించానని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన విషయం ఏంటో పవన్ తనకు చెప్పారని.. కానీ అది వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు బహిరంగంగా చెప్పకపోవడమే మంచిదని రాజు రవితేజ దాటవేశారు. కానీ పూనమ్ కౌర్‌తో వ్యక్తిగతంగా తాను ఇప్పటి వరకు మాట్లడనే లేదని తనతో ఎలాంటి పరిచయం కూడా లేదని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరియర్ ఇదే
ఏపీ రాజకీయాలపై రాజు రవితేజ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉన్న ధోరణితో వెళ్తే రాజకీయాల్లో సక్సెస్ అవడం కష్టం. ఎందుకంటే ఏపీ పొలిటికల్ రేస్‌లో పవన్ థర్డ్ రన్నర్. మొదటి స్థానంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ ఈ పొలిటికల్ రేసులోకి జూనియర్ ఎన్టీఆర్, ఎవరైనా వస్తే పవన్ నాలుగో స్థానంలో ఉంటారు. పోలింగ్ రోజున మీరు సెంటర్‌కు వెళ్లి చూస్తే.. ఓటు వేసేందుకు భారీగా లైన్ ఉంటుంది. అందులో లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్, యువకులు, ముసలి వారు, పేదలు ఇలా అందరూ ఉంటారు.
కానీ ఆ లైన్‌లో పవన్ ఫ్యాన్స్ మాత్రం ఉండరు. వాళ్లు జెండాలు పట్టుకొని బైకులలో ఎక్కడో తిరుగుతుంటారు. వాళ్లతో పవన్‌కు ఏం లాభం ఉండదు. వాళ్లతో పవన్ ఈగో మాత్రమే సంతృప్తి చెందుతుంది. ఇది ఆయనలో మరింత అహంకారాన్ని పెంచుతుందే కానీ వాళ్లతో రియల్‌గా వచ్చేది ఏం లేదు. రియల్‌గా ఓటేసేది ఫ్యామిలీస్, పేదలు మాత్రమే. వాళ్ల జీవితాలను ఎవరైతే మారుస్తారో.. ఆ నమ్మకం ఎవరైతే కలిగిస్తారో వారికే ఓట్ వేస్తారు. పవన్ స్పీచ్‌కు, రియాలిటీకి సంబంధం ఉండదు. అని రాజు రవితేజ అన్నారు.
వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు తప్పు
వలంటీర్లపై పవన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని రాజు రవితేజ అన్నారు. వాళ్లు కూడా ఈ సమాజంలో భాగమే కదా.. వాళ్లు కూడా సమాజం కోసమే పని చేస్తున్నారు. వలంటీర్లను పవన్ ఎందుకు శత్రువులుగా భావిస్తున్నారో తెలియదు. వాళ్లపై అంత ద్వేషం ఎందుకు ఉందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పవన్ ఫ్యాన్స్‌లో కూడా ఇలాంటి ద్వేషమే కనిపిపిస్తుంది. వారికి నచ్చకపోతే బూతులతోనే విరుచుకుపడుతారు. పార్టీని వీడి ఇన్ని రోజులు అయినా తనపై బూతు కామెంట్లు చేస్తూనే ఉన్నారని రాజు రవితేజ పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: బేబీ రనౌత్ రాక కోసం వెయిటింగ్: కంగనా రనౌత్)
Comments
Please login to add a commentAdd a comment