
బీటెక్ పూర్తి చేశాక నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ‘అమ్మ కనక్కు’ సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో అమలా పాల్ కుమార్తెగా నటించింది.
కొంతమంది చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ నటి యువలక్ష్మి. ‘బ్రో ’ అంటూ తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన ఆమె గురించి కొన్ని మాటలు..
యువలక్ష్మి అసలు పేరు యువశ్రీలక్ష్మి. పుదుచ్చేరిలోని కారైకాల్ ఆమె జన్మస్థలం. ఆమెకు భరతనాట్యమంటే చాలా ఇష్టం. భరతనాట్యంలో శిక్షణ పొందింది. పలు ప్రదర్శనలిచ్చి, జాతీయ అవార్డుతోపాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది. బీటెక్ పూర్తి చేశాక నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ‘అమ్మ కనక్కు’ సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో అమలా పాల్ కుమార్తెగా నటించింది.
ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వం వహించిన ‘అప్పా’, శివకార్తికేయన్ ‘వెలైకరన్’, ‘అరుతుర’, ‘కాంచన–3’లో సహాయక పాత్రలు పోషించింది. ‘ఆకాశమిట్టయే’గా రీమేక్ చిత్రంతో యువలక్ష్మి మాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సముద్రఖని డైరక్ట్ చేసిన ‘వినోదాయ సితం’, తెలుగు రీమేక్ ‘బ్రో’లో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలుగా నటించి మెప్పించింది.
జాకీచాన్‌కి పెద్ద ఫ్యాన్ నేను. ఆయన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను ఎప్పుడూ మిస్ కాను.
– యువలక్ష్మి