Samudrakani
-
తండ్రీకొడుకుల నేపథ్యంలో...
నటుడు ధన్ రాజ్ దర్శకుడిగా మారారు. ఈ కొత్త చిత్రంలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్ రాజ్ నటించనున్నారు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పొలవరపు పృథ్వి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుబ్బు కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు శివబాలాజీ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి ‘బలగం’ దర్శకుడు వేణు గౌరవ దర్శకత్వం వహించగా, తెలుగు స్క్రిప్ట్‌ను దర్శకుడు రాజేంద్ర, తమిళ స్క్రిప్ట్‌ను దర్శకుడు భరత్‌కమ్మ యూనిట్ సభ్యులకు అందించారు. ‘విమానం’ చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ మూవీకి కథ–మాటలు అందిస్తున్నారు. ‘‘తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. నవంబరు 9 నుంచి రెగ్యులర్ షూటింగ్నుప్రారంభించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రంప్రారంభోత్సవంలో నటులు సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్, భూపాల్, పృథ్వి, ‘రాకెట్’ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: దుర్గా ప్రసాద్. -
ఏంటి పవన్ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్‌లో..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రీమేక్ సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్‌లో ఉన్నటువంటి పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా హిట్స్ కోసం రీమేక్‌ల మీదే పవన్ ఆధారపడ్డాడని కూడా చెప్పవచ్చు. తన సినీ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ ఒకసారి చూస్తే రీమేక్ లే అని తెలుస్తుంది. (ఇదీ చదవండి: చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ వచ్చేసింది) మెగా హీరోలు నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్‌కు 28వ చిత్రం కాగా సాయి ధరమ్ తేజ్‌కు 15 వ సినిమా కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. రీమేక్ చిత్రాల జాబితాలో పవన్‌కు ఇది 13వ చిత్రం కాగా సాయిధరమ్ తేజ్‌కి ఇది మొదటి రిమేక్ మూవీగా నిలవనుంది. కోలీవుడ్ నుంచి 2021లో విడుదలైన 'వినోదయ సిత్తం' సినిమాకి రీమేక్‌గా 'బ్రో'ని రూపొందించారు. ఈ సినిమాను అక్కడ కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. పవన్ రీమెక్ సినిమాల లిస్ట్ ఇదే 'బ్రో' సినిమాకు ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, తీన్మార్, అన్నవరం, గబ్బర్‌సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్‌సాబ్, భీమ్లానాయక్ ఇప్పుడు బ్రో ఇలా వరుసుగా ఉన్నాయి. అంటే పవన్ చేసిన మొత్తం 28 సినిమాల్లో 13 సినిమాలు రీమేక్‌లు కావడం విశేషం. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) ఈ సినిమాలలో కొన్ని టాలీవుడ్లో మెప్పించినా.. మరికొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వేరే భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలే కావడం విశేషం. జులై 28న విడుదల కానున్న బ్రో రీమేక్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయం, సినిమా ఇలా రంగం ఏదైనా సరే మరోకరిపైనా ఆధారపడటం పవన్‌కు కామన్ పాయింటేనని ఈ జాబితాను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) -
విమానం: అన్నీ ఇచ్చేవాడిని దేవుడనరు, నాన్న అంటారు!
‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి’ అని తండ్రి అంటాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ వంటి సంభాషణలతో ‘విమానం’ టీజర్ విడుదలైంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం జూన్ 9న విడుదల కానుంది. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి వీరయ్య పాత్రను సముద్ర ఖని, కొడుకు పాత్రను మాస్టర్ ధ్రువన్ చేశారు. విమానం ఎక్కాలని ఆశపడే కొడుక్కి బాగా చదువుకుంటే నువ్వే ఎక్కగలవని తండ్రి అంటాడు. ‘‘తండ్రీ–కొడుకు–విమానం చుట్టూ సాగే భాగోద్వేగాల ప్రయాణమే ఈ విమానం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ , ధన్‌రాజ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్ , కెమెరా: వివేక్ కాలేపు. -
Samuthirakani: దర్శకుడి కార్యాలయంలో అపరిచితురాలు
చెన్నై: మదురవాయిల్‌లో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కార్యాలయంలోకి ఒక అపరిచితురాలు చొరబడి కారుపై ఆరేసిన రెయిన్కోట్లను దొంగలించింది. ఈ మేరకు కార్యాలయ మేనేజర్ కార్తీక్ శుక్రవారం సాయంత్రం స్థానిక మదురవాయిల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక మహిళ కార్యాలయంలోకి చొరబడి అక్కడ కారుపై ఆరబెట్టిన రెయిన్కోట్లను తీసుకుని వాటిని ధరించి కారుపై కొంచెం సేపు పడుకుని వెళ్లిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: (Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు) -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి చెల్లెలు
Sai Pallavi Sister Puja Kannan Debut In Kollywood As Heroine: హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోతో కాకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులకు దగ్గరైంది ఈ మలయాళీ బ్యూటీ. తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే పూజా తెరంగేట్రం గురించి పలు వార్తలు వచ్చినా తాజాగా వాటిని నిజం చేస్తూ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ను రివీల్ చేసింది. తమిళ స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకత్వంలో చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా నటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ నటుడు సముద్రఖని సైతం ఉన్నారు. ఇక ఈ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి అక్క సాయిపల్లవిలా పూజా కన్నన్ హీరోయిన్గా ఏ మేరకు మెప్పిస్తుందనే చూడాల్సి ఉంది. -
ఆయన నుంచి నగదు అందుకున్నా!
తమిళసినిమా: దర్శకుడు కథానాయకి నటనకు మెచ్చి నగదు బహుమతిని అందించడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. అలా పలుమార్లు ఆణ్‌దేవదై చిత్ర దర్శకుడి నుంచి నగదు బహుమతిని అందుకున్నానంటోంది నటి రమ్యా పాండియన్. జోకర్ చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం ఆణ్ దేవదై. దర్శకుడు సముద్రకని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి తామిర దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నాయకి రమ్య పాండియన్ తన అనుభవాలను పంచుకుంది. అవేంటో చూద్దాం. జోకర్ చిత్రం చూసి నా నటనను ప్రశంసించిన దర్శక నటుడు సముద్రకని ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత చిత్ర దర్శకుడు తామిర కథ, నా పాత్రను వివరించారు. కథ నచ్చడంతో వెంటనే నటించడానికి అంగీకరించాను. నిజం చెప్పాలంటే జోకర్ చిత్రం తరువాత ఇలాంటి కథా చిత్రంలోనే నటించే అవకాశం వస్తే నా కెరీర్ బాగుంటుందని భావించాను. జోకర్ చిత్రంలో మీరు చూసిన మల్లిక వేరు ఈ చిత్రంలో జెస్సికా వేరుగా ఉంటుంది. నటనలోనూ, రూపురేఖలలోనూ అంత వ్యత్యాసం ఉంటుంది. సముద్రకని సెట్లో ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు. ఆయనతో నేను ఎలాంటి భయం లేకుండా నటించాను. కారణం అంతగా ఆయన నన్ను ఉత్సాహ పరిచి ప్రోత్సహించారు. నేను తమిళ నటిని కావడం కూడా ఒక కారణం కావచ్చు. ఇక దర్శకుడు తామిర మన ఊరు అమ్మాయి అని చాలా అభిమానంగా చూసుకుని నా నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఈ చిత్రం అంగీకరించే ముందు నాకు కలిగిన కొన్ని సందేహాలకు ఆయన చాలా వివరంగా బదులిచ్చారు. నా నటనను ప్రశంసించిన ఆయన షూటింగ్ స్పాట్లోనే నగదు బహుమతి అందించారు. అ సంఘటనను నేనెప్పటికీ మరచిపోలేను. చిత్ర డబ్బింగ్ సమయంలోనూ అలా రెండుసార్లు ఆయన నుంచి నగదు బహుమతిని అందుకున్నాను. సహ నటీనటులు ప్రశంసించినా, కథను, నా పాత్రను తయారు చేసిన దర్శకుడు అభినందించడంలో ఆనందమే వేరు. ఇకపై కూడా కుటుంబపెద్ద లాంటి పాత్రలే పోషిస్తారా? అని అడుగుతున్నారు. ఈ చిత్రంలో సముద్రకనికి అర్ధాంగిగా కుటుంబ పెద్ద పాత్రను పోషించినా, ఐటీలో పనిచేసే యువతిగానే నా పాత్ర ఉంటుంది. ఇçప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఒక పాత్రలో ఒక నటి నటన నచ్చితే ఆపై ఆ తరహా పాత్రల్లోనే చూడాలని కోరుకోవడం లేదు. అందువల్ల రమ్య పాండియన్ ఒక తరహా పాత్రలకే అని ముద్ర వేస్తారన్న భయం లేదు. జోకర్ చిత్రంలో పాత్ర చాలా మందిని అలరించింది. అదేవిధంగా ఆణ్‌దేవదై చిత్రంలోని పాత్ర రమ్య పాండియన్లోని పూర్తి నటిని ఆవిష్కరిస్తుంది. అదే విధంగా జోకర్ చిత్రంలో నన్ను పెద్దగా ఎవరూ గుర్తించలేదు. దర్శకుడు పా.రంజిత్‌నే ఏడాది తరువాత జోకర్ చిత్రంలో నటించింది నేనేనని గుర్తించారు. అదీ సంగీత దర్శకుడు శ్యాన్ రోల్డన్ చెప్పడంతో నన్ను పిలిచి అభినందించారు. ఆణ్ దేవదై చిత్రంలో నటిస్తున్న సమయంలోనే కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆణ్ దేవదై చిత్ర విడుదల తరువాతనే కొత్త చిత్రాలను అంగీకరించాలని నిర్ణయించుకున్నాను. కారణం ఈ చిత్రమే నేనెలాంటి పాత్రల్లో నటించాలన్నది నిర్ణయిస్తుంది. -
ముగ్గురు దర్శకుల గోలీసోడా– 2
తమిళసినిమా: ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు కలిస్తే అది గోలీసోడా– 2 అవుతుంది. గోలీసోడా బాలలు ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రం 2015లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. దీని సృష్టికర్త విజయ్ మిల్టన్. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన మోగాఫోన్ పట్టిన తొలి చిత్రం ఇది. ఆ తరువాత విక్రమ్ హీరోగా ‘10 ఎన్డ్రత్తుకుల్’చిత్రం చేశారు. ఆ చిత్రం నిరాశపరిచినా దర్శకుడు రాజ్‌కుమార్, భరత్‌తో తెరకెక్కించిన ‘కడుగు’ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా విజయ్‌మిల్టన్ తనను దర్శకుడిని చేసిన గోలీసోడా చిత్రానికి సీక్వెల్‌గా ‘గోలీసోడా– 2’పేరుతో మరో ప్రయోగం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో దర్శకుడు సముద్రకని, గౌతమ్‌మీనన్‌లు ప్రధాన పాత్రలను పోషించడం. దర్శకుడు విజయ్మిల్టన్నే ఛాయాగ్రహణ బాధ్యతను నిర్వహించిన ఈ చిత్రాన్ని రఫ్‌నోట్ సంస్థ సమర్పణలో భరత్ సీనీ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత డ్రామాతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ‘పొండాటి’అనే పాట ఇప్పటికే విడుదలై సినీ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని చిత్ర దర్శకుడు తెలిపారు. కాగా చిత్రంలోని ఇతర పాటలను కూడా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి అచ్చురాజమణి సంగీతాన్ని అందించారు. గోలీసోడాకు సీక్వెల్ అయిన గోలీసోడా– 2 ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే ఆశాభావాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
త్వరలో తెరపైకి ఏమాలి!
తమిళసినిమా: ఏమాలి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అజిత్, విక్రమ్, శింబు వంటి స్టార్ హీరోలతో చిత్రాలు చేసిన దర్శకుడు వీజెడ్.దురై చిన్న గ్యాప్ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం యేమాలి. లతా ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.లత నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రకని, శ్యామ్ జోన్స్ హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా అతుల్య, రోషిణి నటిస్తున్న ఇందులో సంగంపులి, బాలశరవణన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్యామ్ డి.రాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు వీజెడ్.దురై వివరిస్తూ ఇది నలుగురు న్యాయవాదుల చుట్టు తిరిగే ఇతివృత్తంగా ఉంటుందన్నారు. ఇందులో సముద్రకని, శ్యామ్ కూడా న్యాయవాదులుగా నటిస్తున్నారని, వారి పాత్రలు కొత్త డైమన్షన్‌లో ఉంటాయని ముఖ్యంగా సముద్రకనిని ఇంతకు ముందు నటించనటువంటి వైవిధ్య పాత్రల్లో చూస్తారని తెలిపారు. యేమాలి అంటే మోసపోయేవాడు అని అర్థం అని, అయితే ఈ చిత్రంలో మరో అర్థం కూడా ఉందని అదే ఈ చిత్రంలో సర్ప్రైజ్గా ఉంటుందని అన్నారు. ఇక నటి అతుల్యరవి అల్డ్రామోడ్రన్ గర్ల్‌గా నటించిందని చెప్పారు. తను సముద్రకనికి జంటగానూ, బెంగళూర్‌కు చెందిన రోషిణి శ్యామ్‌కు జంటగానూ నటిస్తున్నారని చెప్పారు. తన గత చిత్రాలకు మాటలను అందించిన జయమోహన్ ఈ చిత్రానికి చాలా పవర్ఫుల్ సంభాషణలను అందించారని చెప్పారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. తాను పూర్తి ఎఫర్ట్ పెట్టి తెరకెక్కించిన చిత్రం ఏమాలి అని తెలిపారు. -
కోలీవుడ్‌లో బిజీ అవుతున్న తెలుగమ్మాయి
నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం నటుడు జైతో కలిసి నటించిన బెలూన్ చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా విజయ్‌ఆంథోనికి జంటగా కాళీ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నా, అంజలికే అధిక ప్రాధాన్యత ఉంటుందట. తాజాగా అంజలికి మరో అవకాశం తలుపు తట్టింది. నాడోడిగళ్–2 చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. 2009లో తెరపైకి వచ్చిన నాడోడిగళ్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శశికుమార్, విజయ్‌వసంత్, గంజాకరుప్పు, నటి అనన్య, అభినయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇదే చిత్రం తెలుగులోనూ శంభో శివశంబో పేరుతో రీమేక్ అయ్యింది. తాజాగా శశికుమార్ హీరోగా సముద్రఖని దర్శకుడిగా నాడోడిగళ్–2 చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో అంజలి కథానాయికగా నటించనుందన్నది. మరో హీరోయిన్గా నటి అతుల్యరవి నటించనుంది. ఈమె ఇప్పటికే సముద్రఖనితో కలిసి ఏమాలి చిత్రంలో నటిస్తోందన్నది. ఇన్స్పైర్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి వెళ్లనుంది. ఐస్టిన్ ప్రభకరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నాడోడిగళ్ చిత్రానికి సీక్వెల్ కాదట. ఆ బాణీలో సాగే విభిన్న కథా చిత్రంగా నాడోడిగళ్–2 చిత్రం ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. మొత్తం మీద నటి అంజలి కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో మళ్లీ బలం పుంజుకుంటోందన్న మాట. -
ఆ కష్టమేంటో నాకు తెలుసు!
తమిళ సినిమా: ఇవాళ తమిళ సినిమా చాలా వరకు యథార్థాలను వెతుక్కుంటూ సక్సెస్‌కు దగ్గరవుతోందనే చెప్పాలి. చరిత్రను తవ్వుకుంటూ అందులో ఆసక్తికర సంఘటనలకు చిత్ర రూపం ఇస్తోంది.అలా తెరకెక్కుతున్న తాజా చిత్రం వాండు. వివిధ విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందిన మహాగాంధీ, షికా, రిషీరిత్విక్, రమ, సాయ్దీనా,భువనశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎం.పవర్ సినీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. వాసన్ షాజీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన సెల్వరాఘవన్‌తో పాటు పలువురు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పని చేశారు. ఏఆర్.నేశన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శక నటుడు సముద్రకని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి సినీ నేపథ్యంలేకుండా చిత్రాన్ని రూపొందించడం ఎంత కష్టమో తనకు బాగా తెలుసన్నారు. వాండు చిత్రాన్ని దర్శకుడు వాసన్ షాజీతో పాటు మొత్తం యూనిట్ ఎంతో శ్రమించి తెరకెక్కించారని అన్నారు.ఉత్తర చెన్నై భూమి పుత్రులని పేర్కొన్నారు. వారి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే గోలీసోడా చిత్రం గుర్తుకొస్తోందన్నారు. వాండు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సముద్రకని పేర్కొన్నారు. అవకాశాలు మనల్సి వెతుక్కుంటూరావు. మనమే వాటిని కల్పించుకోవాలి అన్న భావనతో చేసిన చిత్రం వాండు అని, ఇది ఉత్తర చెన్నై ప్రజల గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుందని దర్శకుడు వాసన్ షాజీ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు. -
సముద్రకని కర్త, కర్మ ,క్రియగా అప్పా
నవ్యతకు చిరునామా మలయాళ సినిమా అన్నది ఇంతకు ముందు మాట. ఇప్పుడు దాన్ని తమిళ సినిమా ఆక్రమించుకుందని చెప్పవచ్చు. నాడోడిగళ్ చిత్రంతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సముద్రకని ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినా ఒక దశలో దర్శకత్వాన్ని దూరంగా పెట్టి పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఆ మధ్య కిత్నా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆసమయంలో అమలాపాల్ పెళ్లికి సిద్ధం అవడంతో సముద్రకని తన ప్రయత్నానికి తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టారు. తాజాగా ఆయన నటన, దర్శకత్వంతోపాటు నిర్మాతగా అదనపు బాధ్యతలు చేపట్టి అప్పా(నాన్న)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెలైంట్‌గా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి సముద్రకని తెలుపుతూ నాగోడిగళ్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలిసారిగా అప్పా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ నటిస్తున్నానని చెప్పారు. ఇందులో కాక్కాముట్టై చిత్రం ఫేమ్ విఘ్నేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. త ంబిరామయ్య, వినెధిని, నవ నటి ప్రీతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం అని వివరించారు. కచ్చితంగా అప్పా చిత్రం తమిళ సినిమాకు కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారని, ఆయన చిత్రం చూసి అద్భుతంగా తీశావంటూ ప్రశంసించారని సముద్రకని పేర్కొన్నారు. చిత్రాన్ని వచ్చే నెల విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఆ ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు
కొన్ని హిట్ కాంబినేషన్స్‌ను అంత త్వరగా మరచిపోలేం.అలాంటి వారిలో దర్శకద్వయం శశికుమార్, సముద్రకని ఒకరు. వీరిద్దరు కలిసి చేసిన సుబ్రమణియపురం చిత్రం తమిళ చిత్రపరిశ్రమ మరచిపోలేని చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. శశికుమార్ దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలతో పాటు సముద్రకనితో కలిసి నటించిన ఆ చిత్రం 2008 విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత సముద్రకని దర్శకత్వంలో శశికుమార్ ఈశన్ చిత్రంలో హీరోగా నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత ఇద్దరు కలిసి నాడోడిగళ్ చిత్రానికి పని చేశారు. దీనికి శశికుమార్ హీరో, సముద్రకని దర్శకుడు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వారిద్దరూ విడివిడిగానే పనిచేస్తున్నారు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత శశికుమార్, సముద్రకని కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి వెట్రివేల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. వసంతమణి దర్శకత్వం వహించనున్న ఇందులో నాయకిగా మియాజార్జ్ నటించనున్నారు. ప్రభు ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో తంబిరామయ్య, రేణుక ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందన్నది కోలీవుడ్ సమాచారం. -
అటవీవాసుల జీవన చిత్రం కాడు
అటవీవాసుల జీవన విధానాన్ని మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం కాడు అని ఆ చిత్ర హీరో విదార్థ్ పేర్కొన్నారు. ఈయనకు జంటగా నటి సంస్కృతి నటించిన ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని ముఖ్యభూమికను పోషించారు. చక్రవర్తి ఫిలింస్ ఇంటర్ నేషనల్ పతాకంపై వెరునగర్ నందు, శ్యామ్ కార్తిక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టాలిన్ రామలింగం దర్శకత్వం వహించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర హీరో విదార్థ్ మాట్లాడుతూ అడవులను దోచుకుంటున్న అక్రమార్కుల ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం కాడు అని తెలిపారు. సామాజిక స్పృహ కల్పించే పలు అంశాలు ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. దేశం గురించి ఆలోచించే వారు ఈ చిత్రం చూసిన తరువాత అటవీ ప్రాంతాల్లో జీవించే వారి కష్టాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందన్నారు. సాధారణంగా ప్రజలకు ప్రభుత్వంపైన, సమాజంపైన ఒక రకమైన ఆవేశం వ్యక్తం అవుతుంటుందన్నారు. అది ఈ చిత్రంలో సముద్రకని పాత్ర ద్వారా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి చర్చించే చిత్రంగా కాడు ఉంటుందని విదార్థ్ తెలిపారు. అడవులనే -
సముద్రకని చిత్రం చేస్తున్నా
దర్శక నటుడు సముద్రకని చిత్రంలో నటించనున్నట్టు ధన్సిక తెలిపారు. ఈ పేరాన్మై చిత్రం ఫేమ్ బ్యూటీ పరదేశి చిత్రంలోని అభినయం విమర్శకుల్ని సైతం మెప్పించింది. కాగా నిమిర్ద్ను నిల్ చిత్రం తరువాత నటనపై దృష్టి సారించిన దర్శకుడు సముద్రకని ఇటీవల విడుదలైన వేలై ఇల్లా పట్టదారి చిత్రంలో ధనుష్ తండ్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. లేడీ ఓరియంటెడ్ కథాంశంతో కూడిన ఈ చిత్రానికి కిట్నా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు మొదట ప్రకటించారు. అయితే ఆమె, దర్శకుడు విజయ్ను పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో కిట్నా చిత్రంలో తాను నటించనున్నట్లు ధన్సిక వెల్లడించారు. సముద్రకని దర్శకత్వంలో నటించనుండడం సంతోషంగా ఉందని ఈ బ్యూటీ పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని చెప్పారు. ఇది 18 నుంచి 48 ఏళ్ల మధ్య జరిగే ఒక మహిల ఇతివృత్తం అని తెలిపారు. చిత్ర కథ ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందన్నారు. ఇందులో ఒక పాత్రను దర్శకుడు సముద్రకని, మరో పాత్రను ప్రముఖ కన్నడ నటుడు యోగి చేయనున్నారని తెలిపారు. ఇంకో పాత్ర కోసం నటి అమలాపాల్‌ను నటింప జేసే విషయమై దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. అమలాపాల్ ఓకే అంటే వివాహానంతరం ఆమె నటించే తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. యాయా చిత్రం తరువాత తాను నటించిన తిరుందిరుసేసే, కాత్తాడి, వెళ్లిత్తిరు మొదలగు మూడు చిత్రాల విడుదలకు సిద్ధం అవుతున్నాయని ధన్సిక తెలిపారు.