ముగ్గురు దర్శకుల గోలీసోడా– 2 | Three Directors In Golisoda Sequel | Sakshi
Sakshi News home page

ముగ్గురు దర్శకుల గోలీసోడా– 2

Published Tue, May 15 2018 8:36 AM | Last Updated on Tue, May 15 2018 8:36 AM

Three Directors In Golisoda Sequel - Sakshi

గోలీసోడా– 2 చిత్ర వర్కింగ్‌ స్టిల్‌

తమిళసినిమా: ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు కలిస్తే అది గోలీసోడా– 2 అవుతుంది. గోలీసోడా బాలలు ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రం 2015లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. దీని సృష్టికర్త విజయ్‌ మిల్టన్‌. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన మోగాఫోన్‌ పట్టిన తొలి చిత్రం ఇది. ఆ తరువాత విక్రమ్‌ హీరోగా ‘10 ఎన్‌డ్రత్తుకుల్‌’చిత్రం చేశారు. ఆ చిత్రం నిరాశపరిచినా దర్శకుడు రాజ్‌కుమార్, భరత్‌తో తెరకెక్కించిన ‘కడుగు’ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా విజయ్‌మిల్టన్‌ తనను దర్శకుడిని చేసిన గోలీసోడా చిత్రానికి సీక్వెల్‌గా ‘గోలీసోడా– 2’పేరుతో మరో ప్రయోగం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో దర్శకుడు సముద్రకని, గౌతమ్‌మీనన్‌లు ప్రధాన పాత్రలను పోషించడం.

దర్శకుడు విజయ్‌మిల్టన్‌నే ఛాయాగ్రహణ బాధ్యతను నిర్వహించిన ఈ చిత్రాన్ని రఫ్‌నోట్‌ సంస్థ సమర్పణలో భరత్‌ సీనీ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత డ్రామాతో కూడిన యాక్షన్‌ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ‘పొండాటి’అనే పాట ఇప్పటికే విడుదలై సినీ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని చిత్ర దర్శకుడు తెలిపారు. కాగా చిత్రంలోని ఇతర పాటలను కూడా సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి అచ్చురాజమణి సంగీతాన్ని అందించారు. గోలీసోడాకు సీక్వెల్‌ అయిన గోలీసోడా– 2 ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే ఆశాభావాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్‌ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement