Vijay milton
-
తన సినిమా చూసి షాకైన డైరెక్టర్.. తనకు తెలియకుండానే మార్చేశారు!
విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం మళై పిడికత మనితన్. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని 2022లో మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈ మూవీని పూర్తి చేసి శుక్రవారం (ఆగస్టు 2న) విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాను విజయ్ మిల్టన్.. జర్నలిస్టులతో కలిసి వీక్షించాడు.పరిచయ సీన్లోనే..సినిమా ప్రారంభంలో వచ్చిన సీన్ చూసి షాకైపోయాడు. విజయ్ ఆంటోని పాత్ర స్వభావాన్ని తెలుపుతూ ఒక నిమిషంపాటు ఇంట్రడక్షన్ సీన్ ఉందట. నిజానికి డైరెక్టర్ అనుకుంది ఒక సీన్ అయితే ఇక్కడ ఇంకో సీన్ వేశారట. అది ఎవరు యాడ్ చేశారో అర్థం కావడం లేదంటున్నాడు. ఆ ఒక నిమిషం ఓపెనింగ్ సీన్ వల్ల సస్పెన్స్ అనేది లేకుండా పోయిందన్నాడు. దీనివల్ల సినిమా సాదాసీదాగా కనిపిస్తోందన్నాడు.అప్పుడు లేనిది ఇప్పుడెలా?సినిమాను సెన్సార్‌కు పంపించినప్పుడు లేని సీన్ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు ఎలా వచ్చిందో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. మరి అది ఎవరు యాడ్ చేశారనేది తెలియాల్సి ఉంది. మళై పిడికత మనితన్ మూవీలో శరత్ కుమార్, సత్యరాజ్, శరణ్య, మేఘా ఆకాశ్ కీలక పాత్రలు పోషించారు. రాజమణి సంగీతం అందించాడు.చదవండి: ఎడమ చేత్తో భోజనం.. ఫ్రాక్చర్‌తో జీవితం ఇలా అయిపోయిందంటున్న హీరో -
14న తెరపైకి గోలీసోడా–2
తమిళసినిమా: పక్కింటి అమ్మాయి లాంటి భావన, స్పష్టమైన తమిళ భాష ఉచ్చరింపు. అందమైన రూపం వెరసి నటి సుభిక్ష. ఇలాంటి సహజమైన గుణాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టకుంటున్న ఈ భామ కడుగు చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రంలో నటించింది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తనదైన ముద్రవేసుకుంది. అందుకే ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తన తాజా చిత్రం గోలీసోడా–2లో ఏకంగా హీరోయిన్ని చేసేశారు. భరత్ సీనీ హీరోగా నటించి నిర్మించిన ఈ చిత్రం 14న తెరపైకి రానుంది. ఈ ఆనందంలో గోలీసోడా–2 చిత్రంలో నటించిన అనుభవాలను సుభిక్ష చెబుతూ కడుగు చిత్రంలో చిన్న పాత్ర అయినా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పింది. ఆ చిత్రం విడుదల తరువాత ప్రేక్షకులు తనను కడుగు సుభిక్ష అని పిలుస్తుండడం సంతోషంగా ఉందని అంది. మళ్లీ విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో నటించే అవకాశం లభిస్తే బాగుండు అనుకుంటుండగా ఈ గోలీసోడా–2 చిత్రంలో నటించే అవకాశం తన ఇంటి తలుపు తట్టిందని ఊహించలేదని చెప్పింది. ఇందులో భరత్ సీనీకి జంటగా నటించానని చెప్పింది. ఇందులో తన పాత్ర పేరు ఇన్భవల్లి అని తెలిపింది. పక్కింటి అమ్మాయి లాంటి జాలీగా సాగే పాత్ర అని చెప్పింది. ఈ చిత్ర కథ, తన పాత్ర గురించి దర్శకుడు విజయ్‌మిల్టన్ చెప్పినప్పుడు సహజంగా నటిస్తే చాలని, ప్రత్యేకంగా ఎలాంటి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారంది. కడుగు చిత్రంలో తనకు భరత్ సీనీకి చాలా తక్కువ సన్నివేశాలే చోటు చేసుకున్నాయన్న విషయాన్ని దర్శకుడి వద్ద ప్రస్తావించగా తన తన మాటల్ని సరిగా అర్థం చేసుకున్న ఆయన గోలీసోడా–2 చిత్రంలో చాలా బలమైన పాత్రను ఇచ్చారని చెప్పింది. ఇందులో భరత్ సీనీ యాక్షన్ సన్నివేశాల్లో కంటే ప్రేమ సన్నివేశాల్లోనే బాగా నటించారని తెలిపింది. గోలీసోడా చిత్రంలో తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు విజయ్ మిల్టన్ దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన గోలీసోడా–2 చిత్రాన్ని రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ సీనీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. -
ముగ్గురు దర్శకుల గోలీసోడా– 2
తమిళసినిమా: ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు కలిస్తే అది గోలీసోడా– 2 అవుతుంది. గోలీసోడా బాలలు ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రం 2015లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. దీని సృష్టికర్త విజయ్ మిల్టన్. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన మోగాఫోన్ పట్టిన తొలి చిత్రం ఇది. ఆ తరువాత విక్రమ్ హీరోగా ‘10 ఎన్డ్రత్తుకుల్’చిత్రం చేశారు. ఆ చిత్రం నిరాశపరిచినా దర్శకుడు రాజ్‌కుమార్, భరత్‌తో తెరకెక్కించిన ‘కడుగు’ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా విజయ్‌మిల్టన్ తనను దర్శకుడిని చేసిన గోలీసోడా చిత్రానికి సీక్వెల్‌గా ‘గోలీసోడా– 2’పేరుతో మరో ప్రయోగం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో దర్శకుడు సముద్రకని, గౌతమ్‌మీనన్‌లు ప్రధాన పాత్రలను పోషించడం. దర్శకుడు విజయ్మిల్టన్నే ఛాయాగ్రహణ బాధ్యతను నిర్వహించిన ఈ చిత్రాన్ని రఫ్‌నోట్ సంస్థ సమర్పణలో భరత్ సీనీ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత డ్రామాతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ‘పొండాటి’అనే పాట ఇప్పటికే విడుదలై సినీ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని చిత్ర దర్శకుడు తెలిపారు. కాగా చిత్రంలోని ఇతర పాటలను కూడా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి అచ్చురాజమణి సంగీతాన్ని అందించారు. గోలీసోడాకు సీక్వెల్ అయిన గోలీసోడా– 2 ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే ఆశాభావాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
మార్చి 29న గోలీసోడా –2
తమిళసినిమా: గోలీసోడా–2 చిత్రం ఈ నెల 29న విడుదలకు ముస్తాబవుతోంది. ఎలాంటి కాస్టింగ్, అంచనాలు లేకుండా ఇంతకు ముందు విడుదలైన గోలీసోడా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ తాజాగా తెరకెక్కించిన చిత్రం గోలీసోడా –2. దీంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి నమ్మకంతోనే గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత వి.సత్యమూర్తి పొందారు. ఇంతకుముందు ‘తప్పుదండా’ చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించిన సత్యమూర్తి దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వం వహించిన నెంజిల్ తుణివిరుందాళ్, విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన ఒరు నల్లనాళ్ పాత్తు సోల్రేన్ చిత్రాలను తమిళనాడులో విడుదల చేశారు. ప్రస్తుతం తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ పతాకంపై ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యమూర్తి గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొందడం విశేషం. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ విజయ్‌మిల్టన్ చిత్రాలు సాంకేతిక విలువలతో, ఆసక్తికరమైన కథాంశాలతో కూడి ఉంటాయన్నారు. అందుకే ఆయన చిత్రాలంటే తనకు ప్రత్యేక ఆసక్తి అని పేర్కొన్నారు. తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొంది సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 29న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ వాయిస్ఓవర్ ఇచ్చిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విశేష ఆదరణ పొందుతోందని, విజయ్విల్లన్ ఆయన యూనిట్‌పై నమ్మకంతోనూ గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు వి.సత్యమూర్తి తెలిపారు. -
‘అలా చేసేందుకు ధైర్యం చేయడం లేదు’
తమిళ సినిమా: వివాదాలకు భయపడకుండా, విమర్శలను పట్టించుకోకుండా, తాను కోరుకున్న బాటలో ధైర్యంగా దూసుకుపోతున్న నటి అమలాపాల్. మొదట్లోనే ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ, మేనమామతో అక్రమ సంబంధం సాగించే వివాదాస్పద పాత్రలో(సింధూ సమవెళి) నటించి అమలాపాల్ అంటే ఏమిటో సినీ పరిశ్రమకు చాటి చెప్పిన సంచలన నటి ఈమె. ఆ సమయంలో మహిళా సంఘాలతో పాటు పలువురి వ్యతిరేకతకు గురైనా భయపడలేదు. అలా ప్రేమ, అందాలారబోత, కుటుంబ కథా పాత్రలు అంటూ చాలా తక్కువ కాలంలోనే చేసేసిన అమలాపాల్ అంతే తక్కువ కాలంలో దర్శకుడు విజయ్ ప్రేమలో పడి పెళ్లి ముచ్చట కూడా తీర్చేకుంది. ఇంకా వేగంగా విడాకుల తతంగం పూర్తి చేసుకున్న ఈ కేరళ కుట్టి మళ్లీ నటనకు రెడీ అంటూ వచ్చేసింది. ఇటీవల నటించిన తిరుట్టుప్పయలే–2 చిత్రంలో అందాలమోత మోగించి మరోసారి తన రూటే సపరేట్ అని అందరికి అర్థమయ్యేలా చేసింది. తాజాగా అరవిందస్వామికి జంటగా ఒక పిల్లకు తల్లిగా నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం జనవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అమలాపాల్ చాలా గ్యాప్ తరువాత తెలుగులోనూ రీఎంట్రీ అవుతోంది. ఇదో చర్చనీయాంశ కథా చిత్రం అట. ఈ సందర్భంగా ఈ జాన పరిశ్రమ మీదే నేరం మోపేలా మాట్లాడేసింది. అదేమిటో ఈ అమ్మడి మాటల్లోనే చూద్దాం. ‘ఇక్కడ ఛాలెంజింగ్ కథా చిత్రాలను తెరకెక్కించడానికి జంకుతున్నారు. వైవిధ్యభరిత కథలతో చిత్రాలు చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. అలాంటి చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నా, దర్శక నిర్మాతలు సంకోచిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలంటే ఇష్టం అని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కడ వాస్తవ సంఘటనతో చిత్రాలు చేస్తున్నారు. మన సమాజంలోనూ ఎన్నో ఆశ్చర్యకరమైనవి, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వాటిని ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలను వినూత్నంగా తెరకెక్కించవచ్చు. అలా చేయడానికి మన వాళ్లు సాహసించలేకపోతున్నారు. ఇటీవల స్త్రీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పలు చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అయినా ఇంకా హీరోయిన్లు హీరోల చుట్టూ తిరిగి ప్రేమించడం, పాటలు పాడడం లాంటి మూస పాత్రలకే హీరోయిన్లను పరిమితం చేస్తున్నారు. ఒక వేళ స్త్రీ ఇతివృత్తాలతో చిత్రాలు చేసిన వారిని నేరస్తులు గానో, గ్లామరస్‌గానో చూపిస్తున్నారు.ఈ విధానం మారాలి. హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రాలనూ విభిన్న కథలతో చేయవచ్చు’ అన్నారు. -
ఆయన నటిస్తే బాగుంటుందని భావించా!
కోలీవుడ్‌లో ప్రామిసింగ్ దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. తన చిత్రాల్లో ఏదో ఒక సన్నివేశంలో నటుడిగా మెరిసే ఈయనకు ఇటీవల ఇతర చిత్రాల్లోనూ నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఒక పక్క విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంతో బిజీగా ఉన్నా తన మనసును హత్తుకునే పాత్రల్లో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అలా తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం గోలీ సోడా–2. ఇంతకు ముందు వచ్చిన గోలీసోడా చిన్న చిత్రంగా రూపొంది సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం గోలీ సోడా–2. గోలీసోడా చిత్రంతో మెగా ఫోన్ పట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్‌మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ఓవర్ వాయిస్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఇదే చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ వివరిస్తూ నిజం చెప్పాలంటే ఈ చిత్రం కథ రాస్తున్నప్పుడే ఇందులోని ఒక పాత్రను దర్శకుడు గౌతమ్‌మీనన్ చేస్తే బాగుంటుందని భావించానన్నారు. కథను ఆయనకు వినిపించి అందులో పాత్రలో నటిం చమని కోరగా వెంటనే అంగీకరించారని అన్నారు. ఆయనది గౌరవ పాత్రే అయినా కథకు చాలా కీలకంగా ఉంటుందన్నారు. అదే విధంగా ఈ పాత్ర ఆయన యథార్థ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు. గోలీసోడా–2 చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌మిల్టన్ సోదరుడు భరత్సినీ తన రఫ్‌నోట్ పతాకంపై నిర్మిస్తున్నారన్నది గమనార్హం. -
విజయ్‌మిల్టన్ చిత్రంలో హీరోగా టీఆర్
గోలీసాడా,10 ఎండ్రత్తుకుళ్ చిత్రాల దర్శకుడు విజయ్‌మిల్టన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటుడు టీ.రాజేందర్ కథానాయకుడిగా విజయ్‌మిల్టన్ చిత్రం చేయనున్నారు. నిజానికి ఈ చిత్రం గోలీసోడా తరువాత ప్రారంభం కావలసింది. గోలీసోడా చిత్రం అనూహ్య విజయంతో విజయ్మిల్టన్కు ఒక సారిగా పాపులారిటీ పెరిగిపోయింది. దీంతో నటుడు విక్రమ్ హీరోగా చిత్రం చేసే అవకాశం వచ్చింది. దీంతో టీఆర్‌తో చిత్రాన్ని పక్కన పెట్టి విక్రమ్ హీరోగా 10 ఎంత్రత్తుకుళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం విడుదలై ఆశించిన విజయం సాధించలేక పోయింది.దీంతో విజయ్‌మిల్టన్ తదుపరి గోలీసోడా వంటి చిన్న చిత్రాన్ని రూపొందిస్తారని సినీ వర్గాలు భావించారు. అయితే ఆయన ఇంతకు ముందు పక్కన పెట్టిన టీ.రాజేంద్రర్ చిత్రాన్ని చేయ సంకల్పించి ఆ స్క్రిప్ట్ బూజు దులపనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి టీఆర్‌తో విజ య్మిల్టన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.దీన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు.మరో విషయం ఏమిటంటే టీఆర్ చిత్రానికి జరిగినట్లే ఆయన కొడుకు శింబు చిత్రం విషయంలోనూ జరిగింది. దర్శకుడు గౌతమ్‌మీనన్ శింబు హీరోగా అచ్చం ఎంబదు మడమయడా చిత్రాన్ని ప్రారంభించారు.ఆ సమయంలో ఆయనకు అజిత్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో శింబు చిత్రాన్ని పక్కన పెట్టి ఎన్నై అరిందాళ్ చిత్రం చేశారు.ఆ చిత్రం తరువాత ఇప్పుడు మళ్లీ శింబు చిత్రాన్ని రూపొందిస్తున్నార న్నది గమనార్హం. -
విక్రమ్‌కో హిట్ కావాలి
తమిళసినిమా : నటుడు విక్రమ్‌కు అర్జెంట్‌గా ఒక విజయం కావాలి. వైవిధ్యం కోసం ఆరాటపడే అతికొద్ది నటులలో విక్రమ్ ఒకరు. అయినా ఈ మధ్య ఆయనకు సరైన విజయం లభించలేదు. శంకర్ ఐ చిత్రం కోసం అహర్నిశలు శ్రమించినా ఆ చిత్రం అందర్నీ మెప్పించలేకపోయింది. అంతకు ముందు విక్రమ్‌ను అపజయాలే వెంటాడాయి. తాజాగా నటించిన 10 ఎండ్రదుకుళ్ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలోనే మరో చిత్రం చేయనున్నట్లు వెల్లడించిన విక్రయ్ ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. అందువల్ల విక్రమ్కిప్పుడు అర్జెంట్‌గా ఒక విజయం అవసరం. తదుపరి చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న విక్రమ్ రెండు చిత్రాలకు సంతకం చేశారు. అందులో ఒకటి మర్మమనిదన్. ఇంతకు ముందు అరిమానంబి చిత్రంతో సక్సెస్‌పుల్ దర్శకుడనిపించుకున్న వర్ధమాన దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దీని తరువాత బ్రహ్మన్ చిత్ర దర్శకుడు సాక్రటీస్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఈ రెండు చిత్రాలపై విక్రమ్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారట. మరి ఆయన నమ్మకాన్ని ఈ చిత్రాలు ఏ స్థాయిలో నిలబెడతాయో వేచి చూడాల్సిందే. -
సమంతపై చెయ్యి చేసుకున్నాడా?
‘‘ఔనా...? ఆ దర్శకుడు అలా ఎలా చేయగలిగాడు? సమంతను చూస్తే తిట్టబుద్ధి కూడా కాదు.. ఎలా కొట్టాడు?’’ అని తమిళ పరిశ్రమలో ఓ చర్చ జరుగుతోంది. విషయం ఏంటంటే... విక్రమ్, సమంత జంటగా ‘10 ఎన్రదుకుళ్ల’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ లొకేషన్లో సమంతపై చిత్రదర్శకుడు విజయ్ మిల్టన్ చెయ్యి చేసుకున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్త గురించే అందరూ చర్చించుకుంటున్నారు. సమంతను అభిమానించేవాళ్లయితే విజయ్ మిల్టన్‌ని తిట్టుకుంటున్నారట. ఇలా సెలైంట్‌గా ఊరుకుంటే.. ఇంకా ఏమేం జరుగుతుందో అనుకున్నారో ఏమో... ‘‘అయ్యయ్యో... సమంతను నేనెందుకు కొడతానండీ బాబు. ఈ సినిమాలో తనకు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని నేను డూప్‌తో చేయించాలనుకున్నా. కానీ, సమంతే డూప్ లేకుండా చేస్తానని చేసింది. ఓ సీన్లో చాలా వేగంగా కారు నడపాలి. ఆమెను కష్టపెట్టడం ఇష్టం లేక వేరేవాళ్లతో కారు డ్రైవ్ చేయిస్తానన్నా ఊరుకోలేదు. ఆమే చేశారు. సమంత చాలా మంచి అమ్మాయి. ఆమెను తిట్టడానికే మనసు రాదు.. ఇక కొట్టడం కూడానా?’’ అని విజయ్ మిల్టన్ పేర్కొన్నారు. -
గుర్రం కూడా లవ్‌లో పడిపోయిందేమో!
కథానాయిక సమంతకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తొలి చిత్రం ‘ఏ మాయ చేశావే’తోనే తిరుగులేని హీరోయిన్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారామె. ఆ సంగతలా ఉంచితే... సమంత అందచందాలకు కుర్రాళ్లే కాదు... గుర్రం కూడా ఫ్లాట్ అవుతుందా? విచిత్రంగా ఉంది కదూ...! అసలు విషయంలోకి వద్దాం. విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘10 ఎన్రదుకుళ్ల’. ఈ చిత్రంలో ఓ సన్నివేశం కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవాలని దర్శకుడు విజయ్ మిల్టన్ సమంతకు సూచించారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె నేర్చుకోలేకపోయారు. కట్ చేస్తే... ఆ సీన్ చిత్రీకరించే రోజు రానే వచ్చింది. దాంతో ప్రాక్టీస్ చేయకుండానే సమంత సీన్ చేయాల్సి వచ్చింది. పైగా, ఏ గుర్రం మీద అయితే సమంత స్వారీ చేయాలో.. అది ఒక్క ట్రైనర్ తప్ప ఎవరు ఎక్కినా ఊరుకోదట. ఒక్క తన్ను తంతుందట. కానీ, ఆ గుర్రం బాగుండటంతో విజయ్ మిల్టన్ దాన్నే ఫిక్స్ చేశారు. అయితే అది మొండి గుర్రం అని సమంతకు చెప్పలేదు. అసలే ఈ బ్యూటీకి గుర్రాలంటే భయం.. ఇక మొండి గుర్రం అని చెబితే షూటింగ్ చేయరని దర్శకుడు కావాలనే ఆ విషయాన్ని చెప్పలేదు. సమంత గుర్రం ఎక్కుతున్నప్పుడు ఏం జరుగుతుందోనని డెరైక్టర్, ట్రైనర్ భయం భయంగా చూడటం మొదలుపెట్టారు. కానీ, ఆ గుర్రం మొరాయించకపోవడం విశేషం. దాంతో ఆశ్చర్యపోవడం దర్శకుడు, ట్రైనర్ వంతు అయ్యింది. సో.. సమంత అందం చూడగానే గుర్రం కూడా లవ్‌లో పడిపోయిందేమో! -
వామ్మో... ఇంతక్లిష్టమైన పాత్ర చేయలేదు : సమంత
ఒకే సినిమాలో రెండు పాత్రలు చేసే అవకాశం వస్తే.. పైగా ఆ రెండు పాత్రలూ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా పూర్తి భిన్నంగా ఉంటే.. ఆ ఆర్టిస్ట్‌కి సవాల్ లాంటిదే. ప్రస్తుతం సమంత ఈ సవాల్‌ను జయించే పని మీద ఉన్నారు. ‘10 ఎణ్రదుక్కుళ్ళ’ (అంటే.. పది లెక్కపెట్టే లోపు అని అర్థం) అనే తమిళ చిత్రంలో ఆమె రెండు పాత్రలు చేస్తున్నారు. ఒకటి ఆధునిక యువతి, ఇంకోటి గ్రామీణ నేపాలీ యువతి పాత్ర. వీటిలో ఆధునిక యువతి పాత్రను సమంత సునాయాసంగా చేసేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటొచ్చీ గ్రామీణ నేపాలీ యువతి పాత్రే ఆమెను కష్టాల పాలు చేస్తోంది. ‘ఇప్పటివరకూ నా కెరీర్లో ఇలాంటి క్లిష్టమైన పాత్ర చేయలేదు’ అని స్వయంగా సమంతే పేర్కొన్నారు. అసలు సిసలైన నేపాలీ భామలా కనిపించడం కోసం ఆమె కేశాలంకరణ కూడా మార్చుకున్నారు. శారీరక భాషను కూడా మార్చుకుని, ఈ పాత్ర చేస్తున్నారామె. అభినయపరంగా కూడా సవాల్ అనిపించే పాత్ర. రొటీన్‌కి భిన్నంగా ఉండే పాత్రల కోసం ఆరాటపడుతున్న తనకు ఈ పాత్ర పూర్తి సంతృప్తినిస్తోందని సమంత పేర్కొన్నారు. విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
కోయంబేడు మార్కెట్ కుర్రాళ్ల కథే గోలీసోడా
కోయంబేడు మార్కెట్లో పని చేసే కుర్రాళ్ల ఇతివృత్తమే గోలీ సోడా అని ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం గోలీ సోడా. ఇందులో పసంగ చిత్రం ద్వారా జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలనటులు శ్రీరామ్, కిషోర్‌తో పాటు పాండి, మురుగేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో చాందిని, సీత నటించారు. ఈ చిత్రం ఈ నెల 24న తెరపైకి రానుంది. చిత్రం గురించి దర్శకుడు విజయ్ మిల్టన్ తెలుపుతూ చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ మన దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. ఇక్కడకు నిత్యం వేలాది మంది వచ్చి పోతుంటారని పేర్కొన్నారు. అలాంటి మార్కెట్లో పని చేస్తూ మగ్గిపోయే నలుగురు కుర్రాళ్లు తమకంటూ ఒక గుర్తింపు కోసం చేసే ప్రయత్నమే గోలీసోడా అని తెలిపారు. చిత్రంలోని ఏడు నిమిషాల 49 సెకన్లు ఉండే ఫైట్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్ సుప్రియ సుందర్ కంపోజ్ చేయగా ఒక షాట్లో చిత్రీకరించినట్లు చెప్పారు. దర్శకుడు పాడిరాజా మాటలు రాశారని పేర్కొన్నారు. అరుణగిరి సంగీతాన్ని అందించారని, చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి సంస్థ తిరుపతి బ్రదర్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.