సమంతపై చెయ్యి చేసుకున్నాడా? | Samantha came on the turn? | Sakshi
Sakshi News home page

సమంతపై చెయ్యి చేసుకున్నాడా?

Published Sat, Aug 22 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

సమంతపై చెయ్యి చేసుకున్నాడా?

సమంతపై చెయ్యి చేసుకున్నాడా?

‘‘ఔనా...? ఆ దర్శకుడు అలా ఎలా చేయగలిగాడు? సమంతను చూస్తే తిట్టబుద్ధి కూడా కాదు.. ఎలా కొట్టాడు?’’ అని తమిళ పరిశ్రమలో ఓ చర్చ జరుగుతోంది. విషయం ఏంటంటే... విక్రమ్, సమంత జంటగా ‘10 ఎన్రదుకుళ్ల’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ లొకేషన్లో సమంతపై చిత్రదర్శకుడు విజయ్ మిల్టన్ చెయ్యి చేసుకున్నాడనే వార్త ప్రచారంలో ఉంది.
 
 ఈ వార్త గురించే అందరూ చర్చించుకుంటున్నారు. సమంతను అభిమానించేవాళ్లయితే విజయ్ మిల్టన్‌ని తిట్టుకుంటున్నారట. ఇలా సెలైంట్‌గా ఊరుకుంటే.. ఇంకా ఏమేం జరుగుతుందో అనుకున్నారో ఏమో... ‘‘అయ్యయ్యో... సమంతను నేనెందుకు కొడతానండీ బాబు. ఈ సినిమాలో తనకు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని నేను డూప్‌తో చేయించాలనుకున్నా.
 
 కానీ, సమంతే డూప్ లేకుండా చేస్తానని చేసింది. ఓ సీన్లో చాలా వేగంగా కారు నడపాలి. ఆమెను కష్టపెట్టడం ఇష్టం లేక వేరేవాళ్లతో కారు డ్రైవ్ చేయిస్తానన్నా ఊరుకోలేదు. ఆమే చేశారు. సమంత చాలా మంచి అమ్మాయి. ఆమెను తిట్టడానికే మనసు రాదు.. ఇక కొట్టడం కూడానా?’’ అని విజయ్ మిల్టన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement