గుర్రం కూడా లవ్‌లో పడిపోయిందేమో! | Actress Samantha Spotted while Doing Horse Riding | Sakshi
Sakshi News home page

గుర్రం కూడా లవ్‌లో పడిపోయిందేమో!

Published Sun, Aug 16 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

గుర్రం కూడా లవ్‌లో పడిపోయిందేమో!

గుర్రం కూడా లవ్‌లో పడిపోయిందేమో!

కథానాయిక సమంతకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తొలి చిత్రం ‘ఏ మాయ చేశావే’తోనే తిరుగులేని హీరోయిన్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారామె. ఆ సంగతలా ఉంచితే... సమంత అందచందాలకు కుర్రాళ్లే కాదు... గుర్రం కూడా ఫ్లాట్ అవుతుందా? విచిత్రంగా ఉంది కదూ...! అసలు విషయంలోకి వద్దాం. విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘10 ఎన్రదుకుళ్ల’.
 
 ఈ చిత్రంలో ఓ సన్నివేశం కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవాలని దర్శకుడు విజయ్ మిల్టన్ సమంతకు సూచించారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె నేర్చుకోలేకపోయారు. కట్ చేస్తే... ఆ సీన్ చిత్రీకరించే రోజు రానే వచ్చింది. దాంతో ప్రాక్టీస్ చేయకుండానే సమంత సీన్ చేయాల్సి వచ్చింది. పైగా, ఏ గుర్రం మీద అయితే సమంత స్వారీ చేయాలో.. అది ఒక్క ట్రైనర్ తప్ప ఎవరు ఎక్కినా ఊరుకోదట. ఒక్క తన్ను తంతుందట.
 
  కానీ, ఆ గుర్రం బాగుండటంతో విజయ్ మిల్టన్ దాన్నే ఫిక్స్ చేశారు. అయితే అది మొండి గుర్రం అని సమంతకు చెప్పలేదు. అసలే ఈ బ్యూటీకి గుర్రాలంటే భయం.. ఇక మొండి గుర్రం అని చెబితే షూటింగ్ చేయరని దర్శకుడు కావాలనే ఆ విషయాన్ని చెప్పలేదు. సమంత గుర్రం ఎక్కుతున్నప్పుడు ఏం జరుగుతుందోనని డెరైక్టర్, ట్రైనర్ భయం భయంగా చూడటం మొదలుపెట్టారు. కానీ, ఆ గుర్రం మొరాయించకపోవడం విశేషం. దాంతో ఆశ్చర్యపోవడం దర్శకుడు, ట్రైనర్ వంతు అయ్యింది. సో.. సమంత అందం చూడగానే గుర్రం కూడా లవ్‌లో పడిపోయిందేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement