గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. దాని కోసమేనా? | Samantha Rides A Horse During Sunset | Sakshi
Sakshi News home page

Samantha Horse Ride: గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. దాని కోసమేనా?

Published Tue, Jan 30 2024 1:16 PM | Last Updated on Tue, Jan 30 2024 2:04 PM

Samantha Rides A Horse During Sunset - Sakshi

చల్‌ చల్‌ గుర్రం.. చలాకీ గుర్రం అంటూ గుర్రపు స్వారీ చేస్తున్నారు హీరోయిన్‌ సమంత. మయోసైటిస్‌ చికిత్సలో భాగంగా ఏడాది పాటు ఆమె సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారామె. తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

(చదవండి: పదకొండేళ్ల క్రితమే పాన్‌ ఇండియా స్టార్‌ని..పోల్చితే నచ్చదు: శ్రుతీహాసన్‌)

తన కెరీర్‌లో భాగంగానే ఆమె గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే క్యాప్షన్‌లో ఆమె హీలింగ్‌ అనే పదం కూడా వాడటంతో మయోసైటిస్‌ వ్యాధి నివారణ చికిత్సలో భాగంగా ఈ స్వారీ చేస్తున్నారేమో అంటున్నారు నెటిజన్లు. కాగా సమంత నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ విడుదలకి సిద్ధంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement