అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్‌లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ చూస్తే ఈ మూవీని సోషియో ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'పిచ్చి గిచ్చి పట్టిందా తనకీ.. అక్కడ ఎక్కడో చావడానికి 70 లక్షలు ఇస్తుందట' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. టీజర్ చూస్తే ఈ కథ అంతా పర్వత ప్రాంతాల్లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment