జీవితాంతం ఇలాగే కొనసాగించాలని ఉంది! | Samantha takes lessons in horse riding | Sakshi
Sakshi News home page

జీవితాంతం ఇలాగే కొనసాగించాలని ఉంది!

Published Thu, Nov 20 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

జీవితాంతం ఇలాగే కొనసాగించాలని ఉంది!

జీవితాంతం ఇలాగే కొనసాగించాలని ఉంది!

గ్లామర్ తారలు.. సాహసనారీమణులుగా సాక్షాత్కరించడం తెలుగు తెరకు కొత్తేం కాదు. ఒకప్పుడు విజయశాంతి ఫైటింగులు మొదలుపెట్టగానే.. మిగతా భామలు కూడా అదే బాట పట్టి తెరపై సాహసాలు చేసేశారు. ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై అదే ట్రెండ్ మొదలైంది. ‘అరుంధతి’తో అనుష్క ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టి, రుద్రమదేవి, బాహుబలి సినిమాల కోసం యుద్ధ విద్యలు ప్రత్యేకంగా అభ్యసించి మరీ షూటింగుల్లో పాల్గొంటుంటే... ఆమెనే అనుసరిస్తూ ‘బాహుబలి’లో కీలక పాత్ర పోషిస్తున్న తమన్నా కూడా యుద్ధ విద్యలు అభ్యసించారు.
 
 నయనతార కూడా ఈ మధ్య తాను నటించనున్న ఓ తమిళ చిత్రం కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఆ జాబితాలోకి సమంత కూడా చేరారు. సమంత.. కొత్తగా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. విక్రమ్ సరసన నటిస్తున్న తమిళ చిత్రంలోనూ, బన్నీకి జోడీగా నటిస్తున్న త్రివిక్రమ్ సినిమాలోనూ హార్స్ రైడింగ్ నేపథ్యంలో సన్నివేశాలున్నాయట. సమంత గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి కారణం అదే. ‘‘హార్స్ రైడింగ్ భలే మజాగా ఉంది. ప్రతి రోజూ ఉదయమే గుర్రపు స్వారీ చేస్తున్నాను. దాన్ని ఇలాగే జీవితాంతం కొనసాగించాలని ఉంది’’ అంటూ తన సామాజిక మాధ్యమం ద్వారా సమంత స్వయంగా వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement