![Director Vijay Milton Is Unaware of Added 1 Minute Scene in Mazhai Pidikkatha Manithan](/styles/webp/s3/article_images/2024/08/3/Director-Vijay-Milton.jpg.webp?itok=zm_cSxGB)
విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం మళై పిడికత మనితన్. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని 2022లో మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈ మూవీని పూర్తి చేసి శుక్రవారం (ఆగస్టు 2న) విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాను విజయ్ మిల్టన్.. జర్నలిస్టులతో కలిసి వీక్షించాడు.
పరిచయ సీన్‌లోనే..
సినిమా ప్రారంభంలో వచ్చిన సీన్ చూసి షాకైపోయాడు. విజయ్ ఆంటోని పాత్ర స్వభావాన్ని తెలుపుతూ ఒక నిమిషంపాటు ఇంట్రడక్షన్ సీన్ ఉందట. నిజానికి డైరెక్టర్ అనుకుంది ఒక సీన్ అయితే ఇక్కడ ఇంకో సీన్ వేశారట. అది ఎవరు యాడ్ చేశారో అర్థం కావడం లేదంటున్నాడు. ఆ ఒక నిమిషం ఓపెనింగ్ సీన్ వల్ల సస్పెన్స్ అనేది లేకుండా పోయిందన్నాడు. దీనివల్ల సినిమా సాదాసీదాగా కనిపిస్తోందన్నాడు.
అప్పుడు లేనిది ఇప్పుడెలా?
సినిమాను సెన్సార్‌కు పంపించినప్పుడు లేని సీన్ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు ఎలా వచ్చిందో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. మరి అది ఎవరు యాడ్ చేశారనేది తెలియాల్సి ఉంది. మళై పిడికత మనితన్ మూవీలో శరత్ కుమార్, సత్యరాజ్, శరణ్య, మేఘా ఆకాశ్ కీలక పాత్రలు పోషించారు. రాజమణి సంగీతం అందించాడు.
చదవండి: ఎడమ చేత్తో భోజనం.. ఫ్రాక్చర్‌తో జీవితం ఇలా అయిపోయిందంటున్న హీరో
Comments
Please login to add a commentAdd a comment