ఎడమ చేత్తో భోజనం.. ఫ్రాక్చర్‌తో జీవితం ఇలా అయిపోయిందంటున్న హీరో | Naveen Polishetty Life After Fracture, Funny Video Of Him Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇంత బాధలోనూ నవ్వించిన జాతిరత్నాలు హీరో.. వీడియో చూశారా?

Aug 3 2024 1:11 PM | Updated on Aug 3 2024 1:48 PM

Naveen Polishetty Life After Fracture, Watch Video

జాతిరత్నాలు మూవీతో సినీప్రియులకు చెక్కిలిగింతలు పెట్టాడు హీరో నవీన్‌ పొలిశెట్టి. తన యాస, నటనతో అదరగొట్టేశాడు. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ హీరోకు కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్‌ అయింది. ఈ ప్రమాదంలో కుడి కాలు, చేయి ఫ్రాక్చర్‌ అయింది. అప్పటినుంచి సరిగా ఏ పనీ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా షూటింగ్స్‌కు విరామం చెప్పక తప్పలేదు. అయితే నెలలు గడుస్తున్నా ఆ బాధ నుంచి హీరోకు ఇంకా ఉపశమనం దొరకలేదు. 

ఫ్రాక్చర్‌ తర్వాత జీవితం ఇలా..
కానీ ఇంత బాధలోనూ మరోసారి జనాల్ని నవ్వించాడు నవీన్‌ పొలిశెట్టి. ఫ్రాక్చర్‌ తర్వాత జీవితం ఇలా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్‌ చేశాడు. హీరో వెంకటేశ్‌.. ఎనీ సెంటర్‌, సింగిల్‌ హ్యాండ్‌ అని చెప్తున్న డైలాగ్‌ వినగానే నవీన్‌ తన చేయి చూసుకుని ఛానల్‌ మార్చేశాడు. అక్కడ కూడా చేయి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో అన్న చిరంజీవి డైలాగ్‌ వచ్చింది. దీంతో చేయి మీద డైలాగ్స్‌ వచ్చే ఛానల్స్‌ వద్దురా బాబోయ్‌ అని స్పోర్ట్స్‌ ఛానల్‌ పెట్టగా అక్కడ అంపైర్‌ రెండు చేతులు పైకెత్తుతూ సిక్స్‌ అని చూపించాడు.

ఎడమ చేత్తో భోజనం
ఇదేం గోలరా బాబూ అనుకుంటే గానకోకిలకు చప్పట్లు అన్న డైలాగ్‌ వినిపించింది. కట్టుతో ఉన్న చేయితో చప్పట్లు కొట్టలేక ఎడమ చేతితో తన చెంపలు వాయించుకున్నాడు. చివర్లో ఫుడ్‌ కూడా తినడానికి అవస్థలు పడ్డాడు. ఎడమ చేత్తో భోజనం లాగించాడు. ఎవరైనా ఎడమ చేత్తో భోజనం తింటారా? ఇదేనా సంస్కారం? అన్న డైలాగ్‌ రాగానే వెంటనే పక్కనే ఉన్న శునకంలా కేవలం నోరు, నాలుకను ప్లేటుకు ఆనిస్తూ తినేశాడు.

నవ్వు ఆయుధం
నవ్వుతూ ఉంటే జీవితంలో ఏ ఇబ్బందులనైనా అధిగమించవచ్చు. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మిమ్మల్ని ఆనందపర్చడమే నాకిష్టం. పూర్తిగా కోలుకున్నాక నా కొత్త సినిమాలతో మిమ్మల్ని సంతోషపెట్టాలని ఎదురుచూస్తున్నాను. ఇట్లు మీ జానెజిగర్‌ నవీన్‌ పొలిశెట్టి అని చిన్న సందేశం ఇచ్చాడు.

 

 

చదవండి: రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్‌.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement