విక్రమ్‌కో హిట్ కావాలి | Vikram, Vijay Milton to team up once again | Sakshi
Sakshi News home page

విక్రమ్‌కో హిట్ కావాలి

Published Fri, Nov 6 2015 2:50 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

విక్రమ్‌కో హిట్ కావాలి - Sakshi

విక్రమ్‌కో హిట్ కావాలి

తమిళసినిమా : నటుడు విక్రమ్‌కు అర్జెంట్‌గా ఒక విజయం కావాలి. వైవిధ్యం కోసం ఆరాటపడే అతికొద్ది నటులలో విక్రమ్ ఒకరు. అయినా ఈ మధ్య ఆయనకు సరైన విజయం లభించలేదు. శంకర్ ఐ చిత్రం కోసం అహర్నిశలు శ్రమించినా ఆ చిత్రం అందర్నీ మెప్పించలేకపోయింది. అంతకు ముందు విక్రమ్‌ను అపజయాలే వెంటాడాయి. తాజాగా నటించిన 10 ఎండ్రదుకుళ్ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలోనే మరో చిత్రం చేయనున్నట్లు వెల్లడించిన విక్రయ్ ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది.
 
 అందువల్ల విక్రమ్‌కిప్పుడు అర్జెంట్‌గా ఒక విజయం అవసరం. తదుపరి చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న విక్రమ్ రెండు చిత్రాలకు సంతకం చేశారు. అందులో ఒకటి మర్మమనిదన్. ఇంతకు ముందు అరిమానంబి చిత్రంతో సక్సెస్‌పుల్ దర్శకుడనిపించుకున్న వర్ధమాన దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దీని తరువాత బ్రహ్మన్ చిత్ర దర్శకుడు సాక్రటీస్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఈ రెండు చిత్రాలపై విక్రమ్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారట. మరి ఆయన నమ్మకాన్ని ఈ చిత్రాలు ఏ స్థాయిలో నిలబెడతాయో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement