విమానం: అన్నీ ఇచ్చేవాడిని దేవుడనరు, నాన్న అంటారు! | Samuthirakani vimanam movie teaser launch | Sakshi
Sakshi News home page

విమానం: అన్నీ ఇచ్చేవాడిని దేవుడనరు, నాన్న అంటారు!

Published Mon, May 15 2023 3:43 AM | Last Updated on Mon, May 15 2023 7:58 AM

Samuthirakani vimanam movie teaser launch - Sakshi

‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు  కాబట్టి’ అని తండ్రి అంటాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ వంటి సంభాషణలతో ‘విమానం’ టీజర్‌ విడుదలైంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం జూన్‌ 9న విడుదల కానుంది. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి వీరయ్య పాత్రను సముద్ర ఖని, కొడుకు పాత్రను మాస్టర్‌ ధ్రువన్‌ చేశారు.

విమానం ఎక్కాలని ఆశపడే కొడుక్కి బాగా చదువుకుంటే నువ్వే ఎక్కగలవని తండ్రి అంటాడు. ‘‘తండ్రీ–కొడుకు–విమానం చుట్టూ సాగే భాగోద్వేగాల ప్రయాణమే ఈ విమానం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్‌ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్‌ , ధన్‌రాజ్, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌ అర్జున్‌ , కెమెరా: వివేక్‌ కాలేపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement