సముద్రకని చిత్రం చేస్తున్నా | I AM act with Samudrakani movie says Dhansika | Sakshi
Sakshi News home page

సముద్రకని చిత్రం చేస్తున్నా

Published Tue, Aug 5 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

సముద్రకని చిత్రం చేస్తున్నా

సముద్రకని చిత్రం చేస్తున్నా

దర్శక నటుడు సముద్రకని చిత్రంలో నటించనున్నట్టు ధన్సిక తెలిపారు. ఈ పేరాన్మై చిత్రం ఫేమ్ బ్యూటీ పరదేశి చిత్రంలోని అభినయం విమర్శకుల్ని సైతం మెప్పించింది. కాగా నిమిర్ద్ను నిల్ చిత్రం తరువాత నటనపై దృష్టి సారించిన దర్శకుడు సముద్రకని ఇటీవల విడుదలైన వేలై ఇల్లా పట్టదారి చిత్రంలో ధనుష్ తండ్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. లేడీ ఓరియంటెడ్ కథాంశంతో కూడిన ఈ చిత్రానికి కిట్నా అనే టైటిల్‌ను నిర్ణయించారు.
 
 ఈ చిత్రంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు మొదట ప్రకటించారు. అయితే ఆమె, దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో కిట్నా చిత్రంలో తాను నటించనున్నట్లు ధన్సిక వెల్లడించారు. సముద్రకని దర్శకత్వంలో నటించనుండడం సంతోషంగా ఉందని ఈ బ్యూటీ పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని చెప్పారు. ఇది 18 నుంచి 48 ఏళ్ల మధ్య జరిగే ఒక మహిల ఇతివృత్తం అని తెలిపారు. చిత్ర కథ ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందన్నారు.
 
 ఇందులో ఒక పాత్రను దర్శకుడు సముద్రకని, మరో పాత్రను ప్రముఖ కన్నడ నటుడు యోగి చేయనున్నారని తెలిపారు. ఇంకో పాత్ర కోసం నటి అమలాపాల్‌ను నటింప జేసే విషయమై దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. అమలాపాల్ ఓకే అంటే వివాహానంతరం ఆమె నటించే తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. యాయా చిత్రం తరువాత తాను నటించిన తిరుందిరుసేసే, కాత్తాడి, వెళ్లిత్తిరు మొదలగు మూడు చిత్రాల విడుదలకు సిద్ధం అవుతున్నాయని ధన్సిక తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement