Samuthirakani: దర్శకుడి కార్యాలయంలో అపరిచితురాలు  | Robbery in Director Samuthirakani office at maduravoyal | Sakshi
Sakshi News home page

Samuthirakani: దర్శకుడి కార్యాలయంలో అపరిచితురాలు 

Published Sun, Oct 9 2022 8:02 AM | Last Updated on Sun, Oct 9 2022 8:02 AM

Robbery in Director Samuthirakani office at maduravoyal - Sakshi

చెన్నై: మదురవాయిల్‌లో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కార్యాలయంలోకి ఒక అపరిచితురాలు చొరబడి కారుపై ఆరేసిన రెయిన్‌కోట్లను దొంగలించింది. ఈ మేరకు కార్యాలయ మేనేజర్‌ కార్తీక్‌ శుక్రవారం సాయంత్రం స్థానిక మదురవాయిల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక మహిళ కార్యాలయంలోకి చొరబడి అక్కడ కారుపై ఆరబెట్టిన రెయిన్‌కోట్లను తీసుకుని వాటిని ధరించి కారుపై కొంచెం సేపు పడుకుని వెళ్లిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

చదవండి: (Simbu-Sudha Kongara: కేజీఎఫ్‌ చిత్ర బ్యానర్‌లో శింబు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement