ఒకప్పుడు నటులు, దర్శకులు ఎవరి పని వాళ్లు చేసుకునే వాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ దర్శకులు.. పూర్తిస్థాయి నటులుగా మారిపోతున్నారు. కుర్ర హీరోలు చాలామంది డైరెక్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే పైన ఉన్నది అలాంటి యాక్టర్ కమ్ డైరెక్టరే. తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఇతడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు సముద్రఖని. అవును మీలో కొందరు ఊహించింది కరెక్టే. ఈ మధ్య కాలంలో వరసగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నది ఇతడే. అల వైకుంఠపురములో, క్రాక్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, హనుమాన్.. ఇలా విలన్ అనే కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఫేమ్ సొంతం చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)
నటుడిగా ఇంత పేరు తెచ్చుకున్నాడు గానీ సముద్రఖని కెరీర్ దర్శకత్వ శాఖలో మొదలైంది. డిగ్రీ పూర్తవగానే నటుడు అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే తొలుత తమిళంలో సీరియల్, సినిమాల్లో అనామక రోల్స్ చేశాడు. ఎప్పుడైతే ప్రముఖ దర్శకుడు బాలచందర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడో అప్పటి నుంచి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని పలు హిట్ సినిమాలు తీశాడు.
2001 నుంచి తమిళంలో నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోగా.. 'అల వైకుంఠపురములో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయాడు. గతేడాది పవన్ కల్యాణ్ హీరోగా 'బ్రో' మూవీ డైరెక్ట్ కూడా చేశాడు. యాక్టింగ్, డైరెక్షన్‌తో పాటు పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం లాంటి కళలు కూడా ఉన్నాయి. ఇకపోతే సముద్రఖని పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్నది ఈ ఫొటోనే ఇది చూసి మీరు గుర్తుపట్టడమైతే కష్టం. మరి మీలో ఎంతమంది గుర్తుపట్టారు?
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ పిక్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment