ఈమెని గుర్తుపట్టారా? సౌత్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపింది.. కానీ కొన్నాళ్లకే! | Guess The Actress: Famous Actress Silk Smitha Rare And Old Pictures Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Guess The Actress: స్టార్ హీరోలని మించిన ఫాలోయింగ్.. బయోపిక్ కూడా తీశారు!

Published Sun, Aug 4 2024 11:49 AM | Last Updated on Sun, Aug 4 2024 2:20 PM

Famous Actress Silk Smitha Rare And Old Pictures News

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. హీరోయిన్లు గ్లామర్ మెంటైన్ చేసినన్నీ రోజులు, హీరోలకు హిట్ సినిమాలు దక్కినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వీటిలో మార్పులొస్తాయో.. నటీనటులు జీవితాలు అప్పుడప్పుడు తలక్రిందులవుతుంటాయి. అలాంటి ఓ నటినే ఈమె. ఈ మాత్రం చెప్పాం కదా! మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో సంప్రదాయబద్ధంగా చీరలో పూలు పెట్టుకుని కనిపిస్తున్న అమ్మాయి సిల్క్ స్మిత. అవును మీరు ఊహించింది కరెక్టే. పశ్చిమ గోదావరి జిలాల్లో పుట్టి పెరిగిన వడ్లపాటి విజయలక్ష‍్మీ.. టీనేజీలో ఉండగానే హీరోయిన్ అయిపోదామని ఇంట్లో కూడా చెప్పకుండా మద్రాసు పారిపోయింది. పేరు మార్చుకుని సిల్క్ స్మితగా మారిపోయింది. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరుగా మొదలై.. స్టార్ హీరోలతో కలిసి ఐటమ్ డ్యాన్సర్‍‌గా పేరు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్)

80-90ల్లో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఐటమ్ సాంగ్స్ అంటే దర్శకనిర్మాతలకు ముందు గుర్చొచ్చేది ఈమెనే. అంతలా సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపిన సిల్క్ స్మిత.. ఆ తర్వాత వచ్చిన ఫేమ్, డబ్బుని మేనేజ్ చేసుకోలేక.. కొందరు హీరోల మాయలో పడి సర్వస్వం కోల్పోయింది. ఒత్తిడి తట్టుకోలేక కేవలం 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పట్లో సినిమాలు చేసినప్పటికీ.. ఈమెని ఇప్పటి జనరేషన్ కూడా గుర్తుంచుకుంటోంది.

ఇలాంటి సిల్క్ స్మిత రేర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చీరతో అందానికే ఆధార్‌లా ఉన్న సిల్క్‌ని చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఓర్నీ.. ఈమె సిల్క్ స్మితనా అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఈమె జీవితాన్ని ఆధారంగా కొన్నేళ్ల క్రితం హిందీలో 'ద డర్టీ పిక్చర్' అనే మూవీ వచ్చింది. ఇది చూస్తే సిల్క్ స్మిత జీవితం ఎలా ఉంటుందో తెలిసే ఛాన్స్ ఉంది!

(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌.. జోర్దార్‌ సుజాత కంటతడి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement