
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విమానం'. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్, సాంగ్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
తండ్రీ, కుమారుల మధ్య ప్రేమే విమానం
టీజర్ చూస్తే మాస్టర్ ధ్రువన్ కుమారుడిగా నటిస్తే.. తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్ర ఖని నటించారు. వీరి మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు’ కాబట్టి అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే ఓ డైలాగ్ చాలు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రన్, ధన్‌రాజ్, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment