
ప్రముఖ నటి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బులు కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. సదరు పోలీసులకు ఫిర్యాదు చేసి, చోరీ గురించి అసలు నిజాలు బయటపెట్టింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎంత మొత్తం దోపీడికి గురైంది?
మరాఠీ నటి శ్వేత షిండే.. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. నిర్మాతగానూ పలు సీరియల్స్ తీస్తోంది. మహారాష్ట్రలోని సతారాలో తల్లితో కలిసి ఈమె నివాసముంటోంది. అయితే జూన్ 3న ఎవరూ ఇంట్లో లేని సమయంలో దొంగలు పడ్డారు. 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బు కూడా దొంగతనం చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ సమయంలో పనిలో భాగంగా శ్వేత, ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)
దొంగతనం జరిగిన తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి శ్వేత షిండే ఫిర్యాదు చేసింది. 10 గ్రాముల బంగారంతో పాటు చాలా డబ్బు దొంగతనానికి గురైందని పేర్కొంది. అయితే డబ్బులు మొత్తం ఎంతనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ప్రముఖ నటి ఇంట్లోనే దొంగలు పడటం అనేది చాలామంది అవాక్కయ్యేలా చేసింది.
శ్వేత వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో సందీప్ భన్సాలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. 2016లో నిర్మాతగా మారి అప్పటినుంచి యాక్టింగ్ కాస్త పక్కనబెట్టి పలు సీరియల్స్, సినిమాలు తీస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో చోరీ జరగడంతో ఈమె వార్తల్లో నిలిచింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment