నేను పవన్ కల్యాణ్ అభిమానిని | i am big fun of Pawan Kalyan sasy Kajal | Sakshi
Sakshi News home page

నేను పవన్ కల్యాణ్ అభిమానిని

Published Thu, Mar 24 2016 10:58 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నేను పవన్ కల్యాణ్ అభిమానిని - Sakshi

నేను పవన్ కల్యాణ్ అభిమానిని

ఈ వేసవిలో విడుదల కాబోయే రెండు పెద్ద చిత్రాల్లో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, రెండోది సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’. ఇవి కాకుండా తమిళ, హిందీ చిత్రాల్లో పెద్ద చిత్రాలు చేస్తున్నారీ బ్యూటీ. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ కెరీర్ గ్రాఫ్ ఏ మాత్రం పడిపోకుండా కాజల్ దూసుకుళెతున్నారు.
 
  ఆ సంగతలా ఉంచితే... ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ముందు అనీషా ఆంబ్రోస్‌ను నాయికగా అనుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాజల్‌ను తీసుకున్నారు. ఇటీవల కాజల్‌ను ఓ విలేఖరి ఈ విషయం గురించి అడిగారు. ఈ ప్రశ్నకు దర్శక-నిర్మాతలే సమాధానం చెప్పగలుగుతారని కాజల్ అగర్వాల్ అంటూ - ‘‘నేను పవన్ కల్యాణ్ అభిమానిని.
 
  ఆయన సరసన నటించే అవకాశం వస్తే చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చివరికి ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. అభిమాన హీరో, అద్భుతమైన కథ, మంచి పాత్ర, చక్కని టీమ్... ఒక సినిమా ఒప్పుకోవడానికి ఇంత కన్నా మంచి కారణాలు ఏం కావాలి?’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement