మరోసారి చాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ | Pawan kalyan gives Sardaar VIllain Sharadh kelkar another chance | Sakshi
Sakshi News home page

మరోసారి చాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

Published Thu, Jun 30 2016 9:45 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మరోసారి చాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ - Sakshi

మరోసారి చాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ వేషం దక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఓ బాలీవుడ్ నటుణ్ని పిలిచి మరి ప్రతినాయక పాత్ర ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సర్థార్ గబ్బర్సింగ్ సినిమా కోసం ఉత్తరాది నటుడు శరద్ కేల్కర్కు అవకాశం ఇచ్చాడు పవన్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న శరద్ లుక్కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మరోసారి ఇదే విలన్కు ఛాన్స్ ఇస్తున్నాడు పవర్ స్టార్.

పవన్ ప్రస్తుతం, గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మరోసారి శరద్ కేల్కర్నే విలన్గా తీసుకోవాలని భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్. శరద్ పర్సనాలిటీ ఫ్యాక్షనిస్ట్ పాత్రకు సరిగ్గా సరిపోతుందన్న ఆలోచనలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పూర్తిగా పంచె కట్టులోనే కనిపించనున్నాడట. గబ్బర్ సింగ్ తరువాత మరోసారి శృతిహాసన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement