పవన్ బిజీ అవుతున్నాడు
పవన్ బిజీ అవుతున్నాడు
Published Sat, Apr 16 2016 9:07 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
సర్దార్ గబ్బర్సింగ్ రిజల్ట్తో షాక్ తిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అతి త్వరలో సినిమాలకు స్వస్తి పలకాలనుకుంటున్న తరుణంలో వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలకు ఓకే చెప్పేసిన పవన్, ఆ సినిమాలకు కథలు ఫైనల్ చేయనున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్, పీవీపీ లాంటి భారీ సంస్థలు క్యూలో ఉన్నా వారిని కాదని తన స్నేహితులకే సినిమాలు చేయనున్నాడు.
ముందుగా ఎస్ జె సూర్య డైరెక్షన్లో సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మరోసారి తన మిత్రుడు శరత్ మరార్ నిర్మాణంలోనే తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది, ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ కోసం చేయాల్సి ఉన్నా ఇప్పుడు వారినీ కాదని త్రివిక్రమ్, శరత్ మరార్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ముందుగా మాట ఇచ్చిన ప్రకారం దాసరి నారాయణరావు నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించాడు. తనకు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎమ్ రత్నం బ్యానర్లో కూడా సినిమాకు ఓకే చెప్పాడు పవన్. ఈ నాలుగు సినిమాలతో తను ఆర్థికంగా సెటిల్ అయితే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నాడు.
Advertisement
Advertisement