
'పవన్ కళ్యాణ్ కళ్లు తెరవాలి'
హైదరాబాద్: 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా హిందీ వెర్షన్ విషయంలో తాను చెప్పింది నిజమైందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. హిందీలో 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఓపెనింగ్స్ 2 శాతమేనని, నెల రోజుల క్రితం తాను ఊహించిందే జరిగిందని ట్వీట్ చేశారు. ఈ సినిమాను హిందీలో విడుదల చేయడం పెద్ద పొరపాటు అని వర్మ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కళ్లు తెరవాలని, తన చుట్టూ ఉన్న చెడు సలహాదారుల మాటలు వినొద్దని సలహాయిచ్చారు.
'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాను హిందీలో విడుదల చేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదని అంతకుముందు వర్మ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో హిందీలో పవన్ కళ్యాణ్ కంటే ప్రభాస్ పెద్ద హీరోగా గుర్తింపు పొందుతాడని అన్నారు. పవన్ దగ్గర ఎవరైనా చురుకైన, తెలివైన వ్యక్తి ఉంటే ఈ నిర్ణయం మార్చుకోవాలని ఆయనకు సూచించాలని చెప్పారు. 'బహుబలి' మించిన సినిమాతో హిందీలోకి వెళితే బాగుంటుందని, డబ్బింగ్ సినిమాతో కాదని పవన్ కు సలహాయిచ్చారు. అభిమానుల కంటే పవన్ ను తాను ఎక్కువగా అభిమానిస్తానని వర్మ అన్నారు. ఆయనను గౌరవించే అభిమానిగా ఈ సలహా ఇస్తున్నానని చెప్పారు.
SGS Hindi opening is 2% and I predicted 1 month back it is a Bahubalian mistake .PK should open his eyes to bad advisers around him
— Ram Gopal Varma (@RGVzoomin) 8 April 2016
It will be bad for Pawan Kalyan if "Sardar Gabbar Singh" box office in Hindi will prove that Prabhas is bigger than P k on a National Level
— Ram Gopal Varma (@RGVzoomin) 19 March 2016