
గుజరాత్‌లో గబ్బర్
పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొత్త షెడ్యూలు బుధవారం నుంచి గుజరాత్‌లో జరుగుతోంది. 25 రోజుల పాటు ఏకధాటిగా జరగనున్న ఈ కొత్త షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. కథానాయిక కాజల్ అగర్వాల్ ఈ షెడ్యూల్‌లోనే ఎంటరవుతారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో సహా పలుచోట్ల 25 రోజుల షూటింగ్ చేశారు. బాబి దర్శక త్వంలో శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే సమ్మర్‌కు రిలీజ్ కానుందని సమాచారం.