
రతన్‌పూర్‌లో సర్దార్
సంక్రాంతి బరిలో లేకున్నా టీజర్, కొత్త పోస్టర్లతో అభిమానులు పండగ చేసుకునేలా చేశారు పవన్ కల్యాణ్.
సంక్రాంతి బరిలో లేకున్నా టీజర్, కొత్త పోస్టర్లతో అభిమానులు పండగ చేసుకునేలా చేశారు పవన్ కల్యాణ్. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘గోపాల గోపాల’ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. కే.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ‘రతన్ పూర్’ టౌన్ సెట్‌లో జరుగుతోంది. ఇందులో పవన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.