పవన్ బర్త్ డేకు ప్రత్యేక కానుక | Sardaar Gabbar Singh teaser on Pawan Kalyan's b'day | Sakshi
Sakshi News home page

పవన్ బర్త్ డేకు ప్రత్యేక కానుక

Published Tue, Aug 25 2015 1:45 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ బర్త్ డేకు ప్రత్యేక కానుక - Sakshi

పవన్ బర్త్ డేకు ప్రత్యేక కానుక

చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 44వ బర్త్ డే సందర్భంగా ఆయనకు, అభిమానులకు ఓ కానుక అందించనున్నారు. పవన్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'  టీజర్ను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు.

'పవన్ బర్త్ డే కానుకగా ఓ ప్రత్యేక టీజర్ను రూపొందించారు. ఆయన పుట్టిన రోజున విడుదల చేస్తారు' అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపినట్టు ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయిందని, సెప్టెంబర్ 4 నుంచి జరిగే మరో షెడ్యూల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొంటారని తెలిపారు. పవన్ కల్యాణ్తో నటించేందుకు కాజల్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement