Vakeel Saab Teaser Release Date And Time: January 14 Vakeel Saab Teaser Will Launch - Sakshi
Sakshi News home page

'వకీల్ సాబ్' టీజర్ టైమ్ ఫిక్స్

Published Thu, Jan 7 2021 8:11 PM | Last Updated on Fri, Jan 8 2021 12:37 PM

Pawan Kalyan Vakeel Saab Teaser Release Date and Time - Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వకీల్ సాబ్' ఫస్ట్ టీజర్ సంక్రాంతి(జనవరి 14న) సందర్భంగా సాయంత్రం 06:03 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే డిసెంబర్ 31న ఈ సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. మరోసారి జోడీగా ఈ చిత్రంలో పవన్, శృతిహాసన్ కలిసి నటించనున్నారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement