
దేఖో దేఖో... సర్దార్ గబ్బర్‌సింగ్!
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పవన్‌కల్యాణ్ తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కొత్త లుక్ విడుదల చేసి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. కొన్నేళ్ళ క్రితం ‘గబ్బర్‌సింగ్’గా బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన పవన్‌కల్యాణ్, ఈసారి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’గా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. శరత్‌మరార్ నిర్మాణ సారథ్యంలో నార్త్ స్టార్ ఇంటర్నేషనల్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘పవర్’ ఫేమ్ కె.ఎస్. రవీంద్రనాథ్(బాబీ) ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే పవన్‌కల్యాణ్ సమకూర్చారు. ‘‘పవన్‌కల్యాణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ కథ సిద్ధం చేశారు.
ఆయన స్టయిల్‌లో సాగే ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం మూడో షెడ్యూల్ ప్రారంభమవుతుంది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, ఎడిటింగ్: గౌతంరాజు.