మామ, అల్లుళ్ల సవాల్ | allu arjun sarainodu, pawan sardaar gabbar singh for summer release | Sakshi
Sakshi News home page

మామ, అల్లుళ్ల సవాల్

Published Wed, Jan 27 2016 8:42 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మామ, అల్లుళ్ల సవాల్ - Sakshi

మామ, అల్లుళ్ల సవాల్

సంక్రాంతికి బాబాయ్, అబ్బాయ్లు బరిలో దిగగా, సమ్మర్లో కూడా ఇలాంటి రసవత్తర పోటీకి రెడీ అవుతోంది తెలుగు వెండితెర. పండగ పూట బాలకృష్ణ, ఎన్టీఆర్లు ఢీ అంటే ఢీ అన్నారు. అదే జోరులో వేసవి సెలవులకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్లు తలపడటానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. దీంతో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఒకే సమయంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు.

లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్సింగ్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత బన్నీ కూడా గ్యాప్ తీసుకొని బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు కావటంతో ఎవరిది పైచేయి అవుతుందో, అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement