
అన్నయ్య చేతుల మీదుగా ఆడియో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'సర్థార్ గబ్బర్ సింగ్' ఆడియో సోదరుడు చిరంజీవి చేతుల మీదుగా విడుదల అవుతుందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్గా మారింది. మార్చి 20న జరుగనున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారట. స్వయంగా పవనే వెళ్లి అన్నయ్యను ఆహ్వానించినట్లు సమాచారం. అదే నిజమైతే చానాళ్ల తర్వాత ఒకే వేదికపై మెగా స్టార్, పవర్ స్టార్లను చూసే అవకాశం కలుగుతుంది. ఇక ఫ్యాన్స్కైతే పండగే పండగ.
కాగా ఇటీవలే రిలీజైన సర్థార్ టీజర్ సాంగ్కు అనూహ్యమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా ఆడియో వేడుకలో చిరు, పవన్ లు ఒకే వేదిక మీద కనబడితే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు.