కల్యాణ్ రామ్తో జూ.ఎన్టీఆర్ | Jr. NTR to collaborate with brother Kalyan Ram | Sakshi
Sakshi News home page

కల్యాణ్ రామ్తో జూ.ఎన్టీఆర్

Published Mon, Oct 19 2015 12:39 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

కల్యాణ్ రామ్తో జూ.ఎన్టీఆర్ - Sakshi

కల్యాణ్ రామ్తో జూ.ఎన్టీఆర్

చెన్నై: నందమూరి వారసులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

'కల్యాణ్ రామ్ బ్యానర్లో ఓ చిత్రంలో నటించేందుకు జూ.ఎన్టీఆర్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సివుంది' అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. కిక్, రేసుగుర్రం సినిమాలకు వంశీ రచయితగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement