
సాక్షి, హైదరాబాద్ : జైలవకుశతో హిట్‌కొట్టిన తారక్ మరో చిత్రానికి సన్నద్దమౌతున్నాడు. బాబీ దర్శకత్వంలో తారక్ త్రిపాత్రాభినయం అటు అభిమానులను, ప్రేక్షకులను కట్టిపడేసింది. దసరా బరిలో నిలిచిన ఈ చిత్రం తాజాగా వందకోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ ఉత్సాహంతో తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు ఈజైలవకుశ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ తారాగణంతో ఆ చిత్రం తెరకెక్కనుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆ తర్వాతి చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో తీయనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక జోరందుకుందని సమాచారం. తాజాగా దీనికి సంబంధించిన వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. తారక్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో క్రేజీ హీరోయిన్ నటించబోతోందని సమాచారం. ఎవడు, ఐ చిత్రాల ద్వారా సుపరిచితమైన అమీజాక్సన్ ఇందులో హీరోయిన్‌గా చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్దహస్తుదైన త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో కుటుంబ విలువలు నేపథ్యంలో జరిగే ఓ మాస్ సినిమాను తీయబోతున్నారని తారక్ అభిమానులు ఆనందంలో ఉన్నారు.