ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రుడు | Rajendra Prasad to play Jr. NTR's father in his next movie | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రుడు

Published Sat, Jun 20 2015 12:45 PM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రుడు

ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రుడు

చెన్నై:  సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి తండ్రి పాత్ర పోషించనున్నారు. పలు సినిమాల్లో ఇప్పటికే హీరోలకు తండ్రిగా నటించిన ఆయన ఈసారి ఎన్టీఆర్కు తండ్రిగా నటించబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కెస్తున్న 'మా నాన్నకు ప్రేమతో' షూటింగ్ జూన్ 29 నుంచి లండన్లో ప్రారంభం కానుంది.  ముందుగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్రని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేస్తారని అనుకున్నారు.

 

అయితే  చివరకు ఆ పాత్ర చేసే అవకాశం రాజేంద్ర ప్రసాద్కి దక్కింది. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధంపై ఈ సినిమా తెరకెక్నుంది. ఇక చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ కు తండ్రిగా జగపతిబాబు నెగటివ్ రోల్ చేయనున్నారు.  షూటింగ్ నవంబర్ చివరికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement