బాహుబలి-2కు లైన్‌క్లియర్‌.. | Bahubali-2 ready to release on april 28th | Sakshi
Sakshi News home page

బాహుబలి-2కు లైన్‌క్లియర్‌..

Published Wed, Apr 19 2017 8:20 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

బాహుబలి-2కు లైన్‌క్లియర్‌..

బాహుబలి-2కు లైన్‌క్లియర్‌..

బాహుబలి-2 చిత్ర విడుదలకు నెలకొన్న చిక్కులు సమసిపోయాయి. కొద్ది రోజులుగా ఈ చిత్ర విడుదలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. సమస్య కోర్టు గుమ్మం వరకూ వెళ్లింది. వివరాల్లోకెళితే బాహుబలి ఘన విజయం తరువాత దానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం బాహుబలి-2. ప్రబాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సృష్టికర్త రాజమౌళి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో ఏసీఈ సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది.

అందులో శ్రీ గ్రీన్‌ ప్రొడక‌్షన్‌ అధినేత సవరణన్‌ బాహుబలి-2 చిత్ర తమిళనాడు విడుదల హక్కులను పొందారన్నారు. ఆయన 2016లో రూ.1.18కోట్లు రుణం అడిగారని, ఆ మొత్తాన్ని తాము ప్రభుదేవా స్టూడియోస్‌ పేరు మీద ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మొత్తాన్ని రూ.10 లక్షలు వడ్డీతో సహా బాహుబలి-2 విడుదలకు ముందు చెల్లిస్తానని సవరణన్‌ పిబ్రవరిలో అగ్రిమెంట్‌ రాసి ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మాట మార్చిన సరవణన్‌ బాహుబలి-2 చిత్ర విడుదల తరువాత డబ్బు చెల్లిస్తానంటున్నారని, తమకు సొమ్ము చెల్లించేవరకు బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది.

బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌కు బదులు దాఖలు చేయాల్సిందిగా శ్రీ గ్రీన్‌ ప్రొడక‌్షన్‌ అధినేత సవరణన్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా ఇరు తరఫు న్యాయవాధులు కోర్టుకు హాజరై సమస్యను కోర్టు బయట పరిష్కరించుకున్నట్లు తెలియజేయడంతో విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement