బాహుబలి కంటే అదే భయానకం..
విడుదలైన మూడు వారాల్లోనే రూ.1500 కోట్ల కలెక్షన్లు సాధించి భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది బాహుబలి-2. నాలుగో వారం కూడా హౌస్‌ఫుల్ నడుస్తోన్న ఈ సినిమా రూ.2వేల కోట్ల మార్కును కూడా దాటే అవకాశం ఉందని సినీ పండితుల అంచనా. ఇక మొదటి భాగం విడుదలైనప్పటి రెండో భాగం గ్లోబల్ హిట్ అయ్యేదాకా, అయిన తర్వాతకూడా దాదాపు బాహుబలిపై ఎక్కువ ట్వీట్లు చేసింది దర్శకుడు రాంగోపాల్ వర్మనే అంటే అతిశయోక్తికాదు. కొద్ది గంటల కిందటే ఎస్‌ఎస్ రాజమౌళిని ట్యాగ్‌చేస్తూ వర్మ మరో ఆసక్తికర కామెంట్ చేశారు.
‘బాహుబలి కలెక్షన్ల కంటే కూడా రాజమౌళి వినమ్రత, విధేయతలే భయానకంగా అనిపిస్తాయి’ అని వర్మ వ్యాఖ్యానించారు. ‘కట్టప్ప’ విషయంలో కన్నడ సంఘాలను సముదాయించడం దగ్గర్నుంచి బాహుబలి-2ను అభినందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం, పైసరీకారులను పట్టుకున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపేందుకు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం తదితర చర్యలు.. ఇండియన్ మూవీ హిస్టరీలో ఆల్‌టైమ్ హిట్ కొట్టినతర్వాత కూడా రాజమౌళి డౌన్ టు ఎర్త్ అని రూడీచేస్తాయి. గతంలో ‘శివ టు వంగవీటి’ ఫంక్షన్‌లోనూ రాజమౌళి వినయపూరిత ప్రవర్తనపై వర్మ కామెంట్లు చేసిన సంగతి తెలిందే.
Only thing more Scarier than Bahubali2 collections is @ssrajamouli 's Humility and Modesty